ఈ ఏడాది ముచ్చటగా మూడు సినిమాలు

ఈ ఏడాది ముచ్చటగా మూడు సినిమాలు
X
డెబ్యూ సినిమాతోనే ఫెయిలయినప్పటికీ, అవకాశాల పరంగా ఆమె ప్రయాణం మంచి దిశగా సాగుతోంది.

అందాల హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే రవితేజ "మిస్టర్ బచ్చన్" చిత్రం ద్వారా టాలీవుడ్ లో కి ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రం ఘోర పరాజయం పాలైనా, ఎనర్జిటిక్ డాన్స్‌ టాలెంట్‌, అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్స్ కారణంగా ఆమెకు మరిన్ని అవకాశాలు దక్కాయి. డెబ్యూ సినిమాతోనే ఫెయిలయినప్పటికీ, అవకాశాల పరంగా ఆమె ప్రయాణం మంచి దిశగా సాగుతోంది.

ఇప్పటికే భాగ్యశ్రీ.. రామ్ పోతినేనితో చేస్తున్న మూడో తెలుగు చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇంకా టైటిల్ ఖరారు కాని ఈ చిత్రం ఆగస్టు తర్వాత విడుదల కానుంది. రామ్-భాగ్యశ్రీ మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అవుతోందని, సెట్స్‌పైన. ఆఫ్‌స్క్రీన్‌లోనూ వీరిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగిందని సోషల్ మీడియాలో గాసిప్‌లు చక్కర్లు కొడుతున్నాయి.

ఇక విజయ్ దేవరకొండ సరసన కథానాయికగా భాగ్యశ్రీ బోర్సే నటిస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు మేకర్స్. ఈ చిత్రం పేరు "కింగ్‌డమ్". మే 30న ఈ చిత్రం థియేటర్లలో విడుదల కాబోతోంది. ఇది ఆమెకు ఈ ఏడాది తొలి విడుదల కావడం విశేషం. ప్రెస్ మీట్లు, ప్రమోషన్ల ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి ఆమె సిద్ధమవుతోంది.

ఇంక ఇవే కాకుండా.. మరో క్రేజీ ప్రాజెక్ట్‌లో కూడా భాగ్యశ్రీ నటిస్తోంది. దుల్కర్ సల్మాన్‌కు జోడీగా.. "కాంతా" అనే చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రం 2025 చివరిలో విడుదలయ్యే అవకాశం ఉంది. సో.. 2025లో భాగ్యశ్రీ బోర్సే నటించిన 3 సినిమాలు థియేటర్స్ లోకి వచ్చేస్తున్నాయి. మే 30న "కింగ్‌డమ్" విడుదల కానుండగా, ఆగస్టు తర్వాత రామ్‌ హీరోగా నటిస్తున్న సినిమా విడుదలవుతుంది. ఇంక డిసెంబర్ లో దుల్కర్ సల్మాన్ ‘కాంతా’ రిలీజ్ కానుంది. మరి ఈ మూడు సినిమాల్లో భాగ్యశ్రీని టాలీవుడ్ లో క్వీన్ గా నిలబెట్టే సినిమా ఏది అవుతుందో చూడాలి.

Tags

Next Story