అమ్మడి ఆశలన్నీ ‘ఆంధ్రాకింగ్’ పైనే !

అమ్మడి ఆశలన్నీ ‘ఆంధ్రాకింగ్’ పైనే !
X
ఆ పరిస్థితిలో నాలుగో మూవీగా తెరకెక్కిన “ఆంధ్రా కింగ్ తాలూకా” ఇప్పుడు ఆమె కెరీర్‌లో మూడో మూవీగా విడుదల కానుంది.

భాగ్యశ్రీ బోర్సే అందం చూసిన వారు ఒక్క క్షణం కూడా చూపు తిప్పుకోలేరంటే అతిశయోక్తి కాదు. తెరపై మెరిసే ఆమె ఆకర్షణ తెలుగు సినిమా వర్గాలను వెంటనే ఆకట్టుకుంది. అందుకే తొలి సినిమా విడుదల కాకముందే దర్శక–నిర్మాతలు వరుసగా ఆఫర్లు అందజేశారు. ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా మూడు కొత్త చిత్రాల్లో హీరోయిన్‌గా భాగ్యశ్రీ షూటింగ్‌లు కూడా మొదలుపెట్టింది.

కానీ సినీ భాగ్యం మాత్రం ఆమెకు అనుకూలంగా లేకపోయింది. మొదటి చిత్రం “మిస్టర్ బచ్చన్” బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫలమైంది. ఆ తరువాత వచ్చిన “కింగ్డమ్” కూడా ఆశించిన రీతిలో ఆకట్టుకోలేకపోయింది. మూడో సినిమా “కాంత” వాయిదాల పాలై వచ్చే ఏడాదికే మారింది. ఆ పరిస్థితిలో నాలుగో మూవీగా తెరకెక్కిన “ఆంధ్రా కింగ్ తాలూకా” ఇప్పుడు ఆమె కెరీర్‌లో మూడో మూవీగా విడుదల కానుంది.

ఈ చిత్రమే ప్రస్తుతం భాగ్యశ్రీకి టర్నింగ్ పాయింట్‌గా భావిస్తున్నారు. రామ్ పోతినేని హీరోగా రూపొందుతున్న ఈ చిత్రంలో ఆమె నటన, స్క్రీన్ ప్రెజెన్స్‌పై మంచి నమ్మకం పెట్టుకుంది. “ఆంధ్రా కింగ్ తాలూకా” హిట్ అయితే కొత్త అవకాశాలు దొరకడం ఖాయం, లేదంటే మళ్లీ పైకి రావడం ఆమెకు పెద్ద సవాలే.

ఇదిలా ఉంటే, రామ్–భాగ్యశ్రీ కెమిస్ట్రీ ఇప్పటికే టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. సినిమా విడుదలకు ముందే వచ్చిన తొలి పాట బాగా పాపులర్ అవడంతో చిత్రంపై అంచనాలు మరింత పెరిగాయి. ఇప్పుడు అందరి చూపూ భాగ్యశ్రీ బోర్సేపై ఉంది. ఈసారి ఆమె అందం మాత్రమే కాదు, అదృష్టం కూడా వెలుగుతుందా అన్నదే ఆసక్తి.

Tags

Next Story