భయపెడుతూ నవ్వించే ‘కిష్కింధపురి’

భయపెడుతూ నవ్వించే ‘కిష్కింధపురి’
X
ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ కొద్ది నిమిషాల క్రితమే రిలీజ్ అయింది. కౌశిక్ పెగ్గళ్ళపాటి డైరెక్షన్‌లో, షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించిన ఈ చిత్రం హారర్-థ్రిల్లర్ జోనర్‌లో రూపొందింది.

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటిస్తున్న "కిష్కింధాపురి". ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ కొద్ది నిమిషాల క్రితమే రిలీజ్ అయింది. కౌశిక్ పెగ్గళ్ళపాటి డైరెక్షన్‌లో, షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించిన ఈ చిత్రం హారర్-థ్రిల్లర్ జోనర్‌లో రూపొందింది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌కి ఇది మొదటి హారర్ మూవీ. ఇప్పటివరకు అతడు యాక్షన్ థ్రిల్లర్స్‌లో మాత్రమే కనిపించాడు.

సినిమా కథ కిష్కింధపురి అనే ప్రదేశంలో జరుగుతుంది, ఇందులో ‘సువర్ణ మాయ’ అనే మిస్టీరియస్ ఇంటి చుట్టూ కథనం తిరుగుతుంది. ఒక గ్రూప్ యంగ్‌స్టర్స్ ఆ ఇంట్లోకి అడుగుపెట్టినప్పుడు, వాళ్లు భయానక అనుభవాలను ఎదుర్కొంటారు. దీంతో వాళ్ల ప్రాణాలకు ముప్పు ఏర్పడుతుంది. సినిమాలో "ఘోస్ట్ వాకింగ్" కాన్సెప్ట్‌ను కూడా ఎక్స్‌ప్లోర్ చేశారు.

ట్రైలర్‌లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సీరియస్ రోల్‌లో కనిపిస్తే, అనుపమ పరమేశ్వరన్ ఘోస్ట్ అవతార్‌లో డిఫరెంట్ లుక్‌లో కనిపించింది. ట్రైలర్ చివర్లో ఆమె ఎంట్రీ సినిమాకి హైలైట్‌గా నిలిచింది. టెక్నికల్‌గా, సినిమాటోగ్రాఫర్ చిన్మయ్ సలాస్కర్, మ్యూజిక్ డైరెక్టర్ చైతన్ భరద్వాజ్ హారర్ నరేటివ్‌కి సరైన మూడ్‌ని సెట్ చేశారు. "కిష్కింధపురి" సినిమా సెప్టెంబర్ 12న రిలీజ్ కానుంది. ట్రైలర్ హారర్, కామెడీ మిక్స్‌తో సినిమాపై అంచనాల్ని పెంచేసింది.



Tags

Next Story