నెట్‌ఫ్లిక్స్‌ను షేక్ చేస్తున్న బాలయ్య!

నెట్‌ఫ్లిక్స్‌ను షేక్ చేస్తున్న బాలయ్య!
X

గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ హీరోగా, బాబీ దర్శకత్వంలో రూపొందిన హై వోల్టేజ్ యాక్షన్ డ్రామా ‘డాకు మహారాజ్‘. సితార ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మించిన ఈ సినిమా సంక్రాంతి బరిలో విడుదలై బాక్సాఫీస్ వద్ద బడా విజయాన్ని సాధించింది. థియేటర్లలో సూపర్ హిట్ సాధించిన ‘డాకు మహారాజ్‘ ఇప్పుడు ఓటిటిలోనూ దూసుకెళుతోంది.

ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతూ రెండు వారాల్లోనే 5 మిలియన్‌కి పైగా వ్యూస్‌ను సాధించింది. ముఖ్యంగా మొదటి వారం కంటే రెండో వారంలో ‘డాకు మహారాజ్‘ వ్యూస్ మరింతగా పెరిగాయి. ఫస్ట్ వీక్‌లో 2.4 మిలియన్ వ్యూస్ నమోదు చేసుకున్న ఈ చిత్రం, రెండో వారంలో 2.6 మిలియన్ వ్యూస్‌ను సాధించింది. మొత్తంగా వరల్డ్ వైడ్ గా పలు భాషల్లో స్ట్రీమింగ్ అవుతున్న ‘డాకు మహారాజ్‘కి అంతటా ప్రశంసలు దక్కుతున్నాయి.

Tags

Next Story