జార్జియాలో ‘అఖండ 2’ షూటింగ్ !

జార్జియాలో ‘అఖండ 2’ షూటింగ్ !
X
పలు వైవిధ్యమైన, అందమైన లొకేషన్లను పరిశీలిస్తున్నారు. కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను బాలకృష్ణతో పాటు ఇతర నటులతో కలిసి జార్జియాలో చిత్రీకరించనున్నారు.

టాలీవుడ్ మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను తాజాగా తన పుట్టినరోజు జరుపుకున్నారు. ప్రస్తుతం ఆయన నందమూరి బాలకృష్ణతో తెరకెక్కిస్తున్న భారీ ప్రాజెక్ట్ “అఖండ 2: తాండవం” పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ సందర్భంగా చిత్రబృందం ఒక ఆసక్తికరమైన అప్‌డేట్‌ను అభిమానులతో పంచుకుంది. బోయపాటి శ్రీను ఈసారి తన పుట్టినరోజును విదేశాల్లో.. జార్జియాలో జరుపుకున్నారు.

అదే సమయంలో అక్కడ పలు వైవిధ్యమైన, అందమైన లొకేషన్లను పరిశీలిస్తున్నారు. కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను బాలకృష్ణతో పాటు ఇతర నటులతో కలిసి జార్జియాలో చిత్రీకరించనున్నారు. ఈ చిత్రంలో సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే ఆది పినిశెట్టి కీలక పాత్రలో కనిపించనున్నాడు. మొదటి భాగంలో హీరోయిన్‌గా నటించిన ప్రగ్యా జైస్వాల్ మళ్లీ రెండో భాగంలో తన పాత్రను కంటిన్యూ చేస్తోంది.

“అఖండ 2” చిత్రాన్ని రామ్ ఆచంట, గోపిచంద్ ఆచంట కలిసి 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. చిత్రాన్ని బాలకృష్ణ కూతురు ఎం. తేజస్విని సమర్పిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నాడు. బోయపాటి, బాలయ్య కాంబినేషన్‌లో మూడోసారి రానున్న ఈ చిత్రం మీద అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. “అఖండ 2: తాండవం” సినిమా మొదటి భాగాన్ని మించి ఏ రేంజ్ లో ఉండబోతుందో చూడాలి.

Tags

Next Story