మాఫియా బ్రాక్ డ్రాప్ లో బాలయ్య నెక్స్ట్ మూవీ ?

మాఫియా బ్రాక్ డ్రాప్ లో బాలయ్య నెక్స్ట్ మూవీ ?
X
బాలకృష్ణ పాత్రకు మాఫియా ప్రపంచంతో ముడిపడిన ఒక ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ కూడా ఉంది. ఇది కథనానికి మరింత ఇంటెన్సిటీని జోడిస్తుంది.

నట సింహం నందమూరి బాలకృష్ణ తన కెరీర్ లో అత్యంత విజయవంతమైన దశను ఆస్వాదిస్తున్నారు. ‘వీర సింహా రెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్’ వంటి వరుస విజయాల తర్వాత.. ఆయన తన దూకుడును కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం.. ఆయన దర్శకుడు బోయపాటి శ్రీనుతో కలిసి తమ బ్లాక్‌బస్టర్ సినిమా ‘అఖండ’ కు సీక్వెల్‌గా వస్తున్న ‘అఖండ 2’ లో నటిస్తున్న సంగతి తెలిసిందే.

వీటితో పాటుగా.. బాలకృష్ణ మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్ కోసం దర్శకుడు గోపీచంద్ మలినేనితో మళ్ళీ కొలాబెరేట్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా స్క్రిప్ట్ ఇప్పటికే పూర్తయిందని వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రంలో యాక్షన్, బలమైన ఎమోషనల్ సీక్వెన్స్‌లతో కూడిన పవర్‌ఫుల్ సెకండ్ హాఫ్ ఉంటుందని తెలుస్తోంది. మరింత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. బాలకృష్ణ పాత్రకు మాఫియా ప్రపంచంతో ముడిపడిన ఒక ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ కూడా ఉంది. ఇది కథనానికి మరింత ఇంటెన్సిటీని జోడిస్తుంది.

వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట్ సతీష్ కిలారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ కాంబో పట్ల తన ఉత్సాహాన్ని పంచుకుంటూ.. దర్శకుడు గోపీచంద్ మలినేని ఇటీవల సోషల్ మీడియాలో ఇలా పోస్ట్ చేశారు.. “ది గాడ్ ఆఫ్ మాసెస్ ఈజ్ బ్యాక్. ఈసారి మన గర్జన ఇంకా బిగ్గరగా ఉంటుంది. బాలకృష్ణ గారితో మళ్ళీ పనిచేస్తున్నందుకు నేను థ్రిల్‌గా ఉన్నాను. ఈ సినిమా చరిత్రలో ఒక మరపురాని అధ్యాయంగా నిలుస్తుంది...”

ఇది బాలకృష్ణ 111వ ప్రాజెక్ట్ కావడంతో ఆయన అభిమానులకు మరింత ప్రత్యేకంగా మారింది. తన భారీ స్క్రీన్ ప్రెజెన్స్, మాస్ అప్పీల్‌కు పేరుగాంచిన బాలయ్య.. ఈ సినిమాలో మరోసారి యాక్షన్, డ్రామా, ఎమోషన్స్ కలగలిపిన అద్భుతమైన నటనను అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మాఫియా నేపథ్యం, పవర్‌ఫుల్ కథనం ఇంకా.. బాలకృష్ణ అసాధారణమైన పెర్ఫార్మెన్స్ తో తెరకెక్కబోతున్న ఈ సినిమా ఇప్పటికే టాలీవుడ్ వర్గాల్లో భారీ బజ్ క్రియేట్ చేస్తోంది.

Tags

Next Story