బ్యాక్ టు బ్యాక్ తెలుగు చిత్రాల్లో కీర్తి సురేశ్ !

కేరళ అందం కీర్తి సురేష్ తెలుగులో పెద్ద స్టార్ అయింది. ముఖ్యంగా 'మహానటి' సినిమాలో తన నటనకు నేషనల్ అవార్డు కూడా గెలుచుకుంది. అయితే, కొన్ని ఫ్లాప్‌లు, అలాగే ఆమె దృష్టి తమిళ సినిమాలపై మళ్లడం వల్ల ఆమె కొంత వెనుకబడింది. ఈ బ్యూటీ ఇటీవల పెళ్లి చేసుకుని మళ్లీ తెలుగు సినిమాలతో రీ-ఎంట్రీ ఇస్తోంది.
ప్రస్తుతం కీర్తి సురేష్ రెండు తెలుగు సినిమాలకు ఓకే చెప్పింది. ఈ రెండూ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు బ్యానర్‌లోనే వస్తున్నాయి. మొదటి సినిమాలో హీరో విజయ్ దేవరకొండ. 'రౌడీ జనార్దన్' అనే టైటిల్‌తో ఈ సినిమా ఇటీవల లాంఛనంగా ప్రారంభమైంది. రవి కిరణ్ కోలా డైరెక్షన్‌లో ఇది రూరల్ డ్రామాగా ఉంటుందని అంటున్నారు.
రెండో సినిమా 'ఎల్లమ్మ'. దీనికి 'బలగం' ఫేమ్ వేణు దర్శకత్వం వహిస్తారు. హీరోగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఫైనల్ అయ్యారు. షూటింగ్ డిసెంబర్‌లో మొదలవుతుంది. ఈ సినిమాలో కీర్తి సురేష్‌ను హీరోయిన్‌గా ఎంపిక చేయగా.. ఆమె ఇటీవల ఈ ప్రాజెక్ట్‌పై సంతకం చేసింది. ఆమె ఈ రెండు సినిమాల షూటింగ్‌లలో పాల్గొంటుంది. అలాగే మరికొన్ని తెలుగు సినిమాల్లో కూడా కీర్తి నటించే ప్లాన్ లో ఉందని సమాచారం. దాంతో రాబోయే కొన్ని నెలలు హైదరాబాద్‌లో చాలా బిజీగా గడపనుంది.
-
Home
-
Menu