కొత్త అవతారంలో ఆశిష్!

కొత్త అవతారంలో ఆశిష్!
X

'రౌడీ బాయ్స్, లవ్ మీ' చిత్రాలలో హీరోగా నటించినా.. ఆశిష్ కు ఆశించిన స్థాయి గుర్తింపు లభించలేదు. స్టార్ ప్రొడ్యూసర్ దిల్‌రాజు కాంపౌండ్ నుంచి వచ్చిన ఆశిష్ ఇప్పుడు ఓ రా అండ్ రస్టిక్ క్యారెక్టర్ లో మెప్పించడానికి రెడీ అవుతున్నాడట. ఆద్యంతం తెలంగాణ నేపథ్యంలో సాగే కథలో నటించనున్నాడట.




శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందే ఈ చిత్రంతో ఓ నూతన దర్శకుడు పరిచయమవుతాడట. ఓ తెలంగాణ బ్యాండ్ బ్యాక్‌డ్రాప్ తో రస్టిక్ గా సాగే ఈ రూరల్ స్టోరీ అనౌన్స్ మెంట్ రానుందట. త్వరలోనే ఓ ప్రోమోతో ఈ సినిమాని ప్రకటించాలని భావిస్తుందట టీమ్. తెలంగాణ సంస్కృతి, జీవనశైలిని ప్రతిబింబించే ఈ సినిమా, ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించనుందని భావిస్తున్నారు.

Tags

Next Story