'అర్జున్ S/O వైజయంతి' ప్రి-టీజర్ రానుంది!

అర్జున్ S/O వైజయంతి ప్రి-టీజర్ రానుంది!
X

నందమూరి కళ్యాణ్ రామ్, లేడీ సూపర్ స్టార్ విజయశాంతి తల్లీకొడుకులుగా నటిస్తున్న చిత్రం 'అర్జున్ S/O వైజయంతి'. ఈ చిత్రానికి ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహిస్తున్నారు. ఎన్.టి.ఆర్ ఆర్ట్స్, అశోక్ క్రియేషన్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.





ఇప్పటికే ఈ సినిమా గురించి మంచి ఆసక్తి నెలకొనగా, తాజాగా ప్రి-టీజర్ విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు. మార్చి 14న ప్రి-టీజర్ విడుదల కానుంది. ఇది సినిమాపై మరింత ఆసక్తిని పెంచేలా ఉంటుందని చిత్రబృందం భావిస్తోంది. విజయశాంతి, కళ్యాణ్ రామ్ మధ్య తల్లీకొడుకుల అనుబంధాన్ని హృద్యంగా, పవర్‌ఫుల్‌గా మలిచారని సమాచారం.

ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ సరసన సయీ మంజ్రేకర్ కథానాయికగా నటిస్తోంది. బాలీవుడ్ నటుడు, సల్మాన్ ఖాన్ సోదరుడు సోహైల్ ఖాన్ ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. అజనీష్ లోక్ నాథ్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

Tags

Next Story