‘అర్జున్ S/O వైజయంతి’ ప్రీ-టీజర్!

‘అర్జున్ S/O వైజయంతి’ ప్రీ-టీజర్!
X

నందమూరి కళ్యాణ్ రామ్ లేటెస్ట్ మూవీ 'అర్జున్ S/O వైజయంతి'. ఈ మూవీ టైటిల్ తోనే ఈ చిత్రం తల్లీ కొడుకుల సెంటిమెంట్ ప్రధానంగా ఉండబోతున్నట్టు అర్థమవుతుంది. కళ్యాణ్ రామ్ కి తల్లి పాత్రలో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కనిపించబోతుంది. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో ఎన్.టి.ఆర్ ఆర్ట్స్, అశోక్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీ ప్రీ-టీజర్ రిలీజయ్యింది.




సముద్రం ఒడ్డున ఒక పడవపై వెనుతిరిగి కూర్చున్న కళ్యాణ్ రామ్ విజువల్స్ ఈ ప్రీ-టీజర్ లో కనిపిస్తున్నాయి. అజనీష్ లోక్‌నాథ్ ఇంటెన్స్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ తో ఈ ప్రీ-టీజర్ ఆకట్టుకుంటుంది. టీజర్ ను మార్చి 17న విడుదల చేయబోతున్నారు. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ సరసన సయీ మంజ్రేకర్ నటిస్తోంది. సల్మాన్ ఖాన్ సోదరుడు సోహైల్ ఖాన్ ఇతర కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. టీజర్ లోనే ఈ సినిమా రిలీజ్ డేట్ పైనా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Tags

Next Story