
సోషల్ మీడియాకు బ్రేక్ ఇచ్చిన అనుష్క శెట్టి

అందాల హీరోయిన్ అనుష్కా శెట్టి నటించిన "ఘాటి" మూవీ ప్రేక్షకులను టోటల్‌గా డిజప్పాయింట్ చేసింది. క్రిష్ జాగర్లమూడి డైరెక్ట్ చేసిన ఈ సినిమా అనుష్కాకు మంచి కం బ్యాక్ మూవీ అవుతుందని అందరూ భావించారు. కానీ బాక్సాఫీస్ వద్ద ఘోరపరాజయం పాలైంది. ఈ మూవీతో పాటు అనుష్కా కూడా బోలెడు క్రిటిసిజం ఫేస్ చేసింది. ఇప్పటివరకు ఆమె ఈ విషయంపై రియాక్ట్ కాలేదు, కానీ రిలీజ్ ముందు ఫోన్ ఇంటర్వ్యూలతో డిజిటల్‌గా ప్రమోట్ చేసింది.
తాజాగా.. అనుష్కా సోషల్ మీడియాకు బ్రేక్ ఇవ్వాలని డిసైడ్ అయింది. ఇన్‌స్టాగ్రామ్‌లో తన ఫాలోవర్స్‌తో ఈ విషయం షేర్ చేస్తూ.. స్క్రోలింగ్‌ను పక్కన పెట్టి రియల్ వరల్డ్‌తో కనెక్ట్ అవ్వాలని.. అసలు స్టార్టింగ్ పాయింట్‌కి వెళ్లాలని అంది. "ఘాటి" మూవీ రిజల్ట్, ప్రమోషన్స్‌కు హాజరు కాకపోవడంపై వచ్చిన కామెంట్స్‌తో ఆమె హ్యాపీగా లేకపోవచ్చు. అయినా, సోషల్ మీడియా క్రిటిసిజంను ఆమె ఎప్పుడూ సీరియస్‌గా తీసుకోలేదు. ఇప్పుడు ఆమె బౌన్స్ బ్యాక్ అయ్యేందుకు ట్రై చేస్తోంది.
ఇన్‌స్టాగ్రామ్‌లో .. "బ్లూ లైట్‌ను క్యాండిల్ లైట్‌తో ట్రేడ్ చేస్తున్నా. స్క్రోలింగ్ దాటి, రియల్ వరల్డ్‌తో కనెక్ట్ అవ్వడానికి, మనం అసలు స్టార్ట్ చేసిన చోట పని చేయడానికి... సోషల్ మీడియాకు కాస్త బ్రేక్ ఇస్తున్నాను. త్వరలో మీతో మరిన్ని స్టోరీస్ తో, మరింత ప్రేమతో కలుస్తా...." అని అనుష్క రాసింది. ఆమె ఇంకా తెలుగులో కొత్త ప్రాజెక్ట్స్ సైన్ చేయలేదు. కానీ, ఆమె నెక్స్ట్ "కథనార్: ది వైల్డ్ సోర్సరర్" మలయాళం మూవీలో కనిపించనుంది.
-
Home
-
Menu