అనుష్క ‘ఘాటీ’ విడుదల ఎప్పుడు?

టాలీవుడ్‌లో అత్యధికంగా అభిమానులను కలిగి ఉన్న క్రేజీ హీరోయిన్ అనుష్క త్వరలో ‘ఘాటి’ చిత్రంతో మళ్లీ వెండితెరపై సందడి చేయనున్న సంగతి తెలిసిందే. క్రిష్ జాగర్లముడి దర్శకత్వం వహించిన ఈ చిత్రం మొదటి పోస్టర్ విడుదలైనప్పటి నుంచి భారీ అంచనాలు ఏర్పడ్డాయి. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాను ఈ ఏడాది ఏప్రిల్ 18 న థియేటర్స్ లో విడుదల చేయాలని ప్రకటించారు. అయితే, తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం అనిర్దిష్టంగా వాయిదా పడిందని తెలుస్తోంది.
ఈ ప్రాజెక్ట్‌పై ఎప్పటి నుంచో ఎలాంటి అప్‌డేట్ లేకపోవడంతో అభిమానులు నిరాశ చెందుతున్నారు. ఏప్రిల్‌కు సమీపిస్తున్న వేళ ప్రమోషన్లు ఊపందు కుంటాయనుకున్నారు, కానీ ఊహించిన దానికంటే భిన్నంగా సినిమా వాయిదా పడింది.
ప్రస్తుతం యూవీ క్రియేషన్స్ చిరంజీవి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ‘విశ్వంభర’ చిత్రంపై పూర్తిగా దృష్టి సారించినట్లు సమాచారం. ఈ కారణంగా అనుష్క చిత్రానికి సరైన ప్రచారాన్ని అందించలేకపోయారని వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు, అనుష్క అభిమానులు ఈ సినిమా విడుదల కోసం మరికొంత సమయం ఆగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ చిత్రం ఎప్పుడు విడుదలవుతుందో చూడాలి.
-
Home
-
Menu