వరుస ప్రాజెక్ట్స్ చేస్తానంటున్న ‘ఘాటీ’ బ్యూటీ !

వరుస ప్రాజెక్ట్స్ చేస్తానంటున్న ‘ఘాటీ’ బ్యూటీ !
X
తన అభిమానులకు మరిన్ని సినిమాలు అందించాలని, వరుసగా ప్రాజెక్ట్‌లు చేయాలని అనుష్క చెప్పింది.

అందాల అనుష్క శెట్టి మరోసారి యాక్షన్ మోడ్‌లోకి వచ్చేసింది. ఆమె నటించిన “ఘాటి” సినిమా సెప్టెంబర్ 5న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా, బహుభాషల్లో విడుదల కానుంది. తూర్పు ఘాట్స్‌లోని అందమైన ప్రాంతాల్లో విస్తృతంగా చిత్రీకరించిన ఈ సినిమా. తెలుగు సినిమాల్లో ఇప్పటివరకూ చూపని కొత్త లొకేషన్స్‌ను తెరపైకి తీసుకొస్తోంది.

కథలో గంజాయి సాగు ఒక భాగమైనా, అది కేవలం ఒక అంశం మాత్రమేనని, ఇందులో లోతైన కథాంశం ఉందని అనుష్క చెప్పింది. ప్రమోషన్స్‌లో భాగంగా రానా దగ్గుబాటితో అనుష్క ఫోన్ లో మాట్లాడుతూ, “ఘాటి”లో యాక్షన్ సన్నివేశాలు కథలో సహజంగా కలిసిపోతాయని, దర్శకుడు క్రిష్ మరోసారి అద్భుతమైన సినిమాటిక్ అనుభవాన్ని అందిస్తున్నాడని అనుష్క ప్రశంసించింది. ఈ చిత్రంలో ఆమె శీలవతి అనే పాత్రలో కనిపించనుంది.

ఇది “వేదం” సినిమాలోని సరోజా పాత్రలాగే గుర్తుండిపోతుందని ఆమె నమ్ముతోంది. యూవీ క్రియేషన్స్ మరియు ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ భారీగా నిర్మించిన “ఘాటి” విడుదలకు ముందే భారీ బజ్‌ను సృష్టిస్తోంది. అనుష్క ఫిజికల్ ప్రమోషన్స్‌కు దూరంగా ఉన్నప్పటికీ, దర్శకుడు క్రిష్ ఆమె నిర్ణయాన్ని సమర్థించాడు.

తన అభిమానులకు మరిన్ని సినిమాలు అందించాలని, వరుసగా ప్రాజెక్ట్‌లు చేయాలని అనుష్క చెప్పింది. “నేను నిరంతరం పని చేస్తూ, నా ప్రేక్షకుల కోసం వరుసగా సినిమాలు తీసుకొస్తాను,” అని ఆమె హామీ ఇచ్చింది. రాబోయే నెలల్లో, వచ్చే ఏడాది వరకూ ఆమె బిజీగా ఉండబోతోంది.

Tags

Next Story