శర్వానంద్ కు జోడీ గా మళ్ళీ మల్లుకుట్టి ?

శర్వానంద్ కు జోడీ గా మళ్ళీ మల్లుకుట్టి ?
X
ప్రవీణ్ కాండ్రేగుల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో అనుపమ పరదా నశిన్ పాత్రలో కనిపించనుంది. అంటే, బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా జీవించే ఓ మహిళగా ఆమె ఈ చిత్రంలో నటిస్తోంది.

రావిషింగ్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ ప్రదీప్ రంగనాథన్ దర్శకత్వంలో వచ్చిన డ్రాగన్ సినిమాతో భారీ బ్లాక్‌బస్టర్‌ను తన ఖాతాలో వేసుకుంది. ఈ టాలెంటెడ్ నటి ప్రధాన పాత్రలో నటించిన పరదా అనే మిస్టరీ థ్రిల్లర్ ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రవీణ్ కాండ్రేగుల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో అనుపమ పరదా నశిన్ పాత్రలో కనిపించనుంది. అంటే, బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా జీవించే ఓ మహిళగా ఆమె ఈ చిత్రంలో నటిస్తోంది.

తాజా సమాచారం ప్రకారం, అనుపమ పరమేశ్వరన్ శర్వా38 లో చార్మింగ్ స్టార్ శర్వానంద్‌కు జోడీగా నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. సంపత్ నంది దర్శకత్వం వహించనున్న ఈ సినిమాకు సంబంధించి టీం ఇటీవల అనుపమను సంప్రదించగా, ఆమె తక్షణమే అంగీకరించినట్లు సమాచారం. గతంలో అనుపమ, శర్వానంద్ కలిసి నటించిన శతమానం భవతి తెలుగు చిత్ర పరిశ్రమలో ఘన విజయాన్ని అందుకోవడంతో పాటు జాతీయ అవార్డు కూడా సాధించిన సంగతి తెలిసిందే.

శర్వా38 ఒక పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కనుంది. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కె.కె. రాధామోహన్ నిర్మించనున్న ఈ సినిమా షూటింగ్ 2025 ఏప్రిల్‌లో ప్రారంభం కానుంది. ఈ చిత్రానికి సంగీతాన్ని భీమ్స్ సిసిరోలియో అందిస్తున్నారు.

Tags

Next Story