అనుపమా ఆశలన్నీ ‘కిష్కింధపురి’ పైనే !

అనుపమా ఆశలన్నీ ‘కిష్కింధపురి’ పైనే !
X
అనుపమ గత సినిమా ‘పరదా’ బాక్సాఫీస్ వద్ద ఘోరంగా ఫెయిల్ అయింది. ఆ ఫ్లాప్ తర్వాత ఆమెకి ‘కిష్కింధపురి’ మూవీ ఒక కమ్‌బ్యాక్ ఛాన్స్‌గా మారింది. ఈ సినిమాపై ఆమె పూర్తి ఆశలు పెట్టుకుంది, తన కెరీర్‌ను మళ్లీ ట్రాక్‌పైకి తీసుకొచ్చేందుకు ఈ ప్రాజెక్ట్ కీలకమని భావిస్తోంది.

అందాల మల్లూ హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్ తన కెరీర్‌లో మరో కీలకమైన మైలురాయి కోసం సిద్ధమవుతోంది. ఆమె లేటెస్ట్ మూవీ ‘కిష్కింధపురి’ సెప్టెంబర్ 12 న థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా ఒక హారర్ థ్రిల్లర్‌గా రూపొందిన సంగతి తెలిసిందే. ఇందులో అనుపమ బెల్లంకొండ శ్రీనివాస్‌తో స్క్రీన్ షేర్ చేస్తోంది. డైరెక్టర్ కౌశిక్ ఈ ప్రాజెక్ట్‌ను తెరకెక్కించాడు. ఈ సినిమా అనుపమాకి ఓ గేమ్‌ఛేంజర్‌గా నిలవనుందని అంతా ఆశిస్తున్నారు.

అనుపమ గత సినిమా ‘పరదా’ బాక్సాఫీస్ వద్ద ఘోరంగా ఫెయిల్ అయింది. ఆ ఫ్లాప్ తర్వాత ఆమెకి ‘కిష్కింధపురి’ మూవీ ఒక కమ్‌బ్యాక్ ఛాన్స్‌గా మారింది. ఈ సినిమాపై ఆమె పూర్తి ఆశలు పెట్టుకుంది, తన కెరీర్‌ను మళ్లీ ట్రాక్‌పైకి తీసుకొచ్చేందుకు ఈ ప్రాజెక్ట్ కీలకమని భావిస్తోంది. మేకర్స్ ఈ సినిమాను ఒక యూనిక్ హారర్ థ్రిల్లర్‌గా ప్రమోట్ చేస్తున్నారు. కథ కొత్తగా ఉండటమే కాకుండా, ఆడియన్స్‌ను థ్రిల్ చేసే ఎలిమెంట్స్‌తో ఈ మూవీ ఫుల్ ప్యాక్డ్‌గా ఉంటుందని చెబుతున్నారు.

ఇప్పటికే రిలీజైన టీజర్స్, ట్రైలర్స్.. తదితర ప్రమోషనల్ కంటెంట్ సోషల్ మీడియాలో బాగా హైప్ క్రియేట్ చేస్తోంది. ఈ ప్రమోస్ చూసిన ఫ్యాన్స్, సినీ లవర్స్ ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ‘కిష్కింధపురి’ లో అనుపమ క్యారెక్టర్ గురించి కూడా కొంత బజ్ క్రియేట్ అవుతోంది. ఆమె ఈ సినిమాలో ఓ పవర్‌ఫుల్ రోల్‌లో కనిపించబోతోందని, ఆమె యాక్టింగ్ స్కిల్స్‌ను మరోసారి ప్రూవ్ చేసే అవకాశం ఈ మూవీ ఇస్తుందని టాక్. మరి ‘కిష్కింధపురి’ అనుపమ కెరీర్ ను ఎలాంటి మలుపు తిప్పుతుందో చూడాలి.

Tags

Next Story