అక్కినేని 101వ జయంతి.. అభిమానులకు ప్రత్యేక కానుక

టాలీవుడ్ లెజెండరీ నటుడు అక్కినేని నాగేశ్వర రావు 101వ జయంతి సందర్భంగా అభిమానులకు ప్రత్యేక కానుకగా.. ఆయన నటించిన రెండు ఎవర్‌గ్రీన్ క్లాసిక్ సినిమాలు మళ్ళీ థియేటర్ల లోకి రానున్నాయి. ఈ చిత్రాలు ‘డాక్టర్ చక్రవర్తి, ప్రేమాభిషేకం’. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని కొన్ని థియేటర్లలో ఈ చిత్రాలను ఉచితంగా ప్రదర్శించనున్నారు.
సెప్టెంబర్ 20 నుంచి ఈ రీ-రిలీజ్ షోలు ప్రారంభమవుతాయి. ఏఎన్‌ఆర్ సినిమాలను చూసి పెరిగిన అభిమానులకు, కుటుంబాలకు, ముఖ్యంగా వృద్ధులకు ఈ సినిమాలను థియేటర్‌లో మరోసారి చూసే గొప్ప అవకాశం లభించింది. ఈ ఉచిత షోలకు సంబంధించిన బుకింగ్‌లు సెప్టెంబర్ 18, 2025 నుండి బుక్ మై షో లో అందుబాటులోకి వచ్చాయి.
హైదరాబాద్, విజయవాడ, వైజాగ్, ఒంగోలు వంటి ప్రధాన నగరాల్లో ఈ చిత్రాల్ని ప్రదర్శిస్తారు. ఇంకా మరిన్ని కేంద్రాలు ఈ జాబితాలో చేరవచ్చని సమాచారం. వీటిలో క్రాంతి థియేటర్ (వైజాగ్), స్వర్ణ ప్యాలెస్ (విజయవాడ), కృష్ణ టాకీస్ (ఒంగోలు), మరియు హైదరాబాద్‌లోని ఒక ప్రముఖ థియేటర్ ఉన్నాయి.
-
Home
-
Menu