అనిల్ రావిపూడి పెద్ద ప్లానే వేశాడు !

మెగాస్టార్ చిరంజీవి ఈ సంక్రాంతి సీజన్‌లో అనిల్ రావిపూడి దర్శకత్వంలో రాబోతున్న ‘మన శంకరవరప్రసాద్ గారు’ మూవీతో బాక్సాఫీస్ వద్ద సందడి చేయనున్నారు. ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. షూటింగ్ ఇంకా జరుగుతున్నప్పటికీ, చిత్ర బృందం ఇప్పటికే ప్రమోషన్ల కోసం ఒక పెద్ద ప్రణాళికను సిద్ధం చేసింది. దసరా పండుగ నుండి ప్రమోషన్లను ప్రారంభించి, విడుదలయ్యే వరకు దాదాపు మూడు నెలల పాటు కొనసాగించాలని ప్లాన్ చేస్తున్నారు.
ఈ ముందస్తు ప్రమోషన్లు సరైన బజ్‌ని సృష్టించడానికి సహాయపడతాయని నిర్మాతలు నమ్ముతున్నారు.. ప్రత్యేకించి ఈ సినిమా అత్యంత పోటీతో కూడిన సీజన్‌లో విడుదల అవుతున్నాయి. అదే సమయంలో పలు పెద్ద సినిమాలు కూడా విడుదలయ్యే అవకాశం ఉన్నందున, ప్రేక్షకులను ఆకర్షించడానికి ‘మన శంకర ప్రసాద్ గారు’ చిత్రానికి స్పష్టమైన వ్యూహం అవసరం.
తాజా సమాచారం ప్రకారం చిత్ర బృందం ఒకదాని తర్వాత ఒకటిగా వివిధ రకాల కంటెంట్‌ను విడుదల చేసేందుకు ఒక షెడ్యూల్‌ను సిద్ధం చేసింది. ఇందులో యాక్షన్ హైలైట్స్, మాస్ ఎలిమెంట్స్, కీలక పాత్రల పరిచయాలు, ప్రత్యేక పాత్రలు మరియు ముఖ్యంగా భీమ్స్ అందించిన సంగీతం ఉంటాయి. నయనతార గ్లామర్ , వెంకటేష్ ప్రత్యేక పాత్ర, ఇంకా.. ప్రత్యేకమైన "బుల్లిరాజు" పాత్రను బలంగా ప్రచారం చేయనున్నారు. మరి అనిల్ రావిపూడి ప్రమోషనల్ స్ట్రాటజీ ఎంత వరకూ సక్సెస్ అవుతుందో చూడాలి.
-
Home
-
Menu