హైదరాబాద్ లో ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ షూటింగ్

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ “ఆంధ్ర కింగ్ తాలుకా”. ఈ సినిమా షూటింగ్ ఇటీవల రాజమండ్రి, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలా రోజుల పాటు జరిగింది. రివర్సైడ్ లొకేషన్స్‌లో కీలక సీన్స్‌ను చిత్రీకరించిన ఈ టీమ్, ఇప్పుడు హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీకి షిఫ్ట్ అయ్యింది. ఈ షెడ్యూల్లో క్రేజీ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. రామ్ తో పాటు స్టార్ యాక్టర్ ఉపేంద్ర కూడా ఫుల్ ఎనర్జీతో పాల్గొంటున్నారు.
ఈ సినిమాలో ఉపేంద్ర సూపర్‌స్టార్ సూర్యకుమార్ అనే క్యారెక్టర్లో కనిపించనున్నారు. ఇక రామ్ పోతినేని మాత్రం సూర్యకుమార్ డై-హార్డ్ ఫ్యాన్‌గా తనదైన ఎనర్జీతో ఆడియన్స్‌ను ఫిదా చేయనున్నాడు. ఈ మూవీని మహేష్ బాబు పి డైరెక్ట్ చేస్తుండగా, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ ఈ ప్రాజెక్ట్‌ను గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు. హీరోయిన్గా భాగ్యశ్రీ బోర్సే రామ్‌కు జోడీగా నటిస్తూ, తన గ్లామర్ మరియు టాలెంట్‌తో సినిమాకు అదనపు ఆకర్షణ తీసుకొస్తోంది.
రామ్ పోతినేని డైనమిక్ పెర్ఫార్మెన్స్, ఉపేంద్ర లాంటి సీనియర్ యాక్టర్ పవర్ఫుల్ రోల్, మరియు మహేష్ బాబు పి క్రియేటివ్ విజన్‌తో ఈ సినిమా యూత్ , ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకునే అన్ని అంశాలను కలిగి ఉంది. ఈ చిత్రం థియేటర్లలో రిలీజ్ అయినప్పుడు బాక్సాఫీస్ వద్ద ఓ రేంజ్లో సందడి చేయడం ఖాయమని ఇప్పటి నుండే టాక్ నడుస్తోంది.
-
Home
-
Menu