‘కూలీ’ లో నటించడం నేను చేసిన పెద్ద తప్పు : ఆమిర్ ఖాన్

బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్.. రజనీకాంత్ 'కూలీ' సినిమాలో నటించడం తాను చేసిన పెద్ద తప్పు అని సినిమా విడుదలైన నెల రోజుల తర్వాత ఒప్పుకున్నాడు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించినంతగా ఆడలేదు. ఇటీవల ఓటీటీలో విడుదలైన తర్వాత కూడా దీనిపై విమర్శలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా ఆమిర్ ఖాన్ అటువంటి చిన్న పాత్రను ఎందుకు ఒప్పుకున్నారని చాలామంది ప్రశ్నించారు.
ఈ నిర్ణయంపై ఆలోచిస్తూ ఆమిర్ ఖాన్ మాట్లాడుతూ.. ‘రజనీకాంత్ తో కలిసి నటించాలనే కోరికతోనే ఈ పాత్రను ఒప్పుకున్నానని చెప్పాడు. తన అతిథి పాత్ర సినిమాకి మరింత ఆకర్షణ తీసుకొస్తుందని భావించాను.. కానీ, అది సరిగా కుదరలేదు. నేను ఈ సినిమా నిర్మాణంలో భాగం కాలేదు...’ అని అతడు స్పష్టం చేశాడు.
దర్శకుడు లోకేష్ కనగరాజ్, కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర, ఆమిర్ ఖాన్ వంటి పెద్ద నటులను చిన్న పాత్రలలో చూపించారని విపరీతమైన ట్రోలింగ్ ఎదుర్కొన్నారు. అంతేకాకుండా, నాగార్జున అక్కినేని పోషించిన విలన్ పాత్రపై కూడా విమర్శకుల నుంచి, ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. ఒకప్పుడు చాలా జాగ్రత్తగా సినిమాలు ఎంపిక చేసుకునే అమీర్ ఖాన్, ఈ మధ్య వరుసగా బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అవుతున్న సినిమాలలో నటిస్తూ ఆశ్చర్యపరుస్తున్నాడు.
-
Home
-
Menu