సరికొత్త హెయిర్ స్టైల్ తో ఐకాన్ స్టార్

సరికొత్త హెయిర్ స్టైల్ తో ఐకాన్ స్టార్
X
బన్నీ హెయిర్ స్టైల్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. నిన్న మొన్నటి వరకూ పుష్ప గెటప్ లో ఫుల్ గెడ్డం, జులపాల జుట్టుతో కనిపించిన బన్నీ.. లేటెస్ట్ మేకోవర్ మెప్పిస్తోంది.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పవర్ ఫుల్ ప్రాజెక్స్ట్ తో స్పాట్‌లైట్‌లో ఉన్నాడు. 'పుష్ప 2' భారీ విజయం తర్వాత.. బన్నీ.. తన తదుపరి పెద్ద ప్రాజెక్ట్ కోసం అట్లీతో జత కట్టనున్నాడు. ఈ కాంబో అభిమానుల్లో ఉత్సాహం నింపగా... ఇటీవల అతడు కుటుంబ కార్యక్రమంలో కనిపించాడు. తన భార్య స్నేహా రెడ్డి, కుమార్తె అర్హాతో కలిసి తన బంధువు వివాహానికి హాజరయ్యాడు. ఈ నేపథ్యంలో బన్నీ హెయిర్ స్టైల్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. నిన్న మొన్నటి వరకూ పుష్ప గెటప్ లో ఫుల్ గెడ్డం, జులపాల జుట్టుతో కనిపించిన బన్నీ.. లేటెస్ట్ మేకోవర్ మెప్పిస్తోంది.

అల్లు అర్జున్ గెడ్డం, హెయిర్ స్టైల్ ను బాగా ట్రిమ్ చేసుకొని రివీలైన బన్నీ.. అభిమానుల్ని ఖుషీ చేస్తున్నాడు సాదా గోధుమ రంగు కుర్తా, నలుపు రంగు ట్రౌజర్‌లతో స్టైలిష్‌గా కనిపించాడు బన్నీ. భార్య స్నేహా రెడ్డి ఎరుపు రంగు చీరలో బంగారు బార్డర్‌తో, భారీ నెక్‌పీస్‌తో అద్భుతంగా కనిపించింది. వారి చిన్నారి అర్హా లైమ్ గ్రీన్ హాఫ్ సారీలో అందంగా ముస్తాబైంది. ఈ ముగ్గురూ వివాహిత జంట, వారి కుటుంబ సభ్యులతో కలిసి గ్రూప్ ఫోటోలో చేరారు.

అల్లు అర్జున్, అట్లీ కాంబో మూవీ విషయానికి వస్తే, ఈ చిత్రానికి తాత్కాలికంగా 'AA22xA6' అనే వర్కింగ్ టైటిల్ పెట్టారు. ఇది అతన్ని సూపర్ హీరో ప్రపంచంలో చూపించనుంది. అట్లీ దర్శకత్వంలో మొట్టమొదటిసారిగా వర్క్ చేస్తున్న అల్లు అర్జున్ ఇప్పటికే ముంబైలో లుక్ టెస్ట్ అండ్ కాన్సెప్ట్ ఫోటోషూట్ పూర్తి చేశాడు.

Tags

Next Story