బన్నీ ఇంట్రో సీన్స్ అదిరిపోతాయట !

బన్నీ ఇంట్రో సీన్స్ అదిరిపోతాయట !
X
అల్లు అర్జున్ మైండ్ బ్లోయింగ్ ఇంట్రడక్షన్ సీన్స్‌ని ముంబైలోని ప్రసిద్ధ మెహబూబ్ స్టూడియోలో ప్రత్యేకంగా డిజైన్ చేసిన సెట్‌లో చిత్రీకరిస్తున్నారు. ఈ సీన్స్ చూస్తే ఫ్యాన్స్‌కి గూస్‌బంప్స్ రావడం గ్యారంటీ.

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ స్టార్ డైరెక్టర్ అట్లీతో చేతులు కలిపి ఓ భారీ ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాని సన్ పిక్చర్స్ సంస్థ గ్రాండ్ స్కేల్‌లో నిర్మిస్తోంది. ఇది ఖచ్చితంగా సినీ ప్రేక్షకులకు విజువల్ ట్రీట్‌గా ఉండబోతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె ప్రధాన హీరోయిన్‌గా కనిపించనుంది. ప్రస్తుతం షూటింగ్ సూపర్ స్పీడ్‌తో జరుగుతోంది,

తాజా అప్‌డేట్ ఏంటంటే.. అల్లు అర్జున్ మైండ్ బ్లోయింగ్ ఇంట్రడక్షన్ సీన్స్‌ని ముంబైలోని ప్రసిద్ధ మెహబూబ్ స్టూడియోలో ప్రత్యేకంగా డిజైన్ చేసిన సెట్‌లో చిత్రీకరిస్తున్నారు. ఈ సీన్స్ చూస్తే ఫ్యాన్స్‌కి గూస్‌బంప్స్ రావడం గ్యారంటీ. ఈ సినిమాలో అల్లు అర్జున్ రెండు టోటల్లీ డిఫరెంట్ క్యారెక్టర్స్‌లో కనిపించ బోతున్నాడు. అందులో ఒక యంగ్ క్యారెక్టర్ కోసం ఇంట్రో సీన్స్‌ని గ్రీన్ మ్యాట్ బ్యాక్‌డ్రాప్‌లో షూట్ చేస్తున్నారు. ఇది విజువల్‌గా ఎపిక్ లెవెల్‌లో ఉండబోతోందని టాక్. ఈ సీన్స్ సినిమాకి ఓ మేజర్ హైలైట్‌గా నిలవనున్నాయని యూనిట్‌కి దగ్గరి వర్గాలు కన్ఫామ్ చేస్తున్నాయి.

ఈ షెడ్యూల్ మరో కొన్ని రోజులు కంటిన్యూ అవుతుందట. ఫ్యాన్స్ ఇప్పట్నుంచే ఎక్స్‌పెక్టేషన్స్‌ పెంచేసుకుంటున్నారు. ఈ భారీ ప్రాజెక్ట్ కోసం నిర్మాతలు హాలీవుడ్‌లోని టాప్ వీఎఫ్ఎక్స్ కంపెనీలను రంగంలోకి దించారు. అంటే విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో ఈ సినిమా నెక్స్ట్ లెవెల్‌లో ఉండబోతోంది. అంతేకాదు, ఈ సినిమాలో మరికొంతమంది స్టార్ నటీనటులు కీలక పాత్రల్లో మెరవనున్నారని తెలుస్తోంది, ఇది ఈ మూవీ హైప్‌ని మరింత పెంచేస్తోంది.

Tags

Next Story