అల్లు - అట్లీ కాంబో మూవీ విడుదల అప్పుడేనా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్లో ఓ భారీ చిత్రాన్ని ఇటీవలే అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఇప్పటికీ ప్రారంభం కాలేదు. తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం ఈ సినిమా షూటింగ్ డిసెంబర్ 2025 లేదా జనవరి 2026లో మొదలయ్యే అవకాశం ఉంది.
ఈ భారీ ఆలస్యం వెనుక ప్రధాన కారణం ప్రీ-ప్రొడక్షన్ పనులే. అట్లీ ఈ సినిమాకు టాప్ టెక్నీషియన్స్‌ను తీసుకురావడంతో పాటు, అత్యాధునిక టెక్నాలజీ ఉపయోగించనున్నాడని సమాచారం. ఈ టెక్నికల్ ప్రిపరేషన్ పనులన్నీ పూర్తయ్యేందుకు కనీసం మరో ఆరు నెలలు పట్టే అవకాశం ఉంది. అందుకే షూటింగ్ ఆలస్యమవుతోంది.
ఈ మధ్యే అల్లు అర్జున్ ప్రముఖ సెలబ్రిటీ ఫిట్నెస్ ట్రైనర్ లాయిడ్ స్టీవెన్స్‌ను హైర్ చేసారు. అతని గైడెన్స్‌తో బన్నీ ప్రత్యేకమైన ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ వర్క్ చేస్తున్నాడు. ఈ సినిమా కోసం అతడి బాడీ లాంగ్వేజ్, లుక్ మొత్తం మారుస్తున్నారు.
ఈ చిత్రాన్ని 2027 సంక్రాంతికి విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారని సమాచారం. అంతవరకు అల్లు అర్జున్ నుండి మరో సినిమా విడుదలయ్యే అవకాశం లేదు. అంటే ఈ సినిమానే అతడి తదుపరి రిలీజ్ కావొచ్చు. అట్లీ డైరెక్షన్, బన్నీ ట్రాన్స్ఫర్మేషన్, అత్యాధునిక టెక్నాలజీ .. ఇవన్నీ కలిసిన ఈ సినిమా గురించి టాలీవుడ్లో భారీ అంచనాలు నెలకొంటున్నాయి.
-
Home
-
Menu