కొత్త ప్రాజెక్టులతో వేగం పెంచుతున్న అఖిల్

టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని అఖిల్ తన సినిమాల స్పీడ్‌ను పెంచుతున్నాడు. ప్రస్తుతం అతడు ‘వినరో భాగ్యము విష్ణుకథ’ ఫేమ్ మురళీ కిశోర్ అబ్బూరుతో ఓ సినిమా చేస్తున్నాడు. హైదరాబాద్‌లో ఈ సినిమా చిత్రీకరణ జరుగుతుండగా... అఖిల్ సహా ప్రధాన తారాగణంపై యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. అనంతరం ఓ పాటను చిత్రీకరించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాకు ‘లెనిన్’ అనే పేరు పరిశీలనలో ఉంది.
ఇదిలా ఉంటే.. అఖిల్ త్వరలోనే యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై కొత్త దర్శకుడు అనిల్ దర్శకత్వంలో ఓ భారీ పీరియాడిక్ చిత్రం చేయనున్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఇప్పుడు మరో కొత్త ప్రాజెక్ట్‌కు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ కొత్త చిత్రానికి ‘సామజవరగమన’ చిత్ర సహ రచయిత నందు కథ అందించగా.. అతడి దర్వకత్వంలో తెరకెక్కనున్న చిత్రానికి అఖిల్ ఓకే చెప్పినట్లు సమాచారం.
పూర్తిగా వినోదాత్మకంగా ఉండనున్న ఈ సినిమా అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ ఏడాదిలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ ప్రాజెక్ట్‌ను శ్రీనివాసా చిట్టూరి నిర్మించనున్నారని సమాచారం. మొత్తంగా చూస్తే, వరుస సినిమాలతో అఖిల్ తన కెరీర్‌కి కొత్త జోష్ తెచ్చుకుంటున్నాడు!
-
Home
-
Menu