‘అఖండ 2’ బడ్జెట్ ను మించిపోయిందా?

‘అఖండ 2’  బడ్జెట్ ను మించిపోయిందా?
X
ఈ భారీ విజన్ కారణంగా సినిమా బడ్జెట్ ప్లాన్‌ను మించిపోయింది. దీంతో ఖర్చు రికవరీపై ఆందోళనలు నెలకొన్నాయి.

నందమూరి నటసింహం బాలకృష్ణ “అఖండ 2 తాండవం” సినిమాను దసరా సీజన్‌లో రిలీజ్ చేయాలనే పట్టుదలతో నిర్మాతలు ఉన్నారు. గతంలో సెప్టెంబర్ 25, 2025ను రిలీజ్ డేట్‌గా ఖరారు చేసిన ఈ చిత్ర షూటింగ్ పనులు వేగంగా సాగుతున్నాయి. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుగుతోంది. దసరా డెడ్‌లైన్‌ను చేరుకోవడానికి టీమ్ రాత్రింబవళ్లు శ్రమిస్తున్నప్పటికీ, సినిమా బడ్జెట్‌ను మించిపోయిందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

డైరెక్టర్ బోయపాటి శ్రీను ఈ చిత్రాన్ని తన గత సినిమాల కంటే గ్రాండ్ స్కేల్‌లో తెరకెక్కిస్తున్నారు. బాలకృష్ణతో ఆయన గత కలబరేషన్స్ బాక్సాఫీస్ విజయాలను బట్టి, “అఖండ 2” కూడా భారీ బిజినెస్ సృష్టిస్తుందనే నమ్మకంతో ఉన్నారు. ప్రేక్షకుల అంచనాలను అందుకోవడానికి, అద్భుతమైన విజువల్స్, హై-ఓక్టేన్ యాక్షన్ సీన్స్ కోసం ఖర్చుకు వెనుకాడటం లేదు.కానీ, ఈ భారీ విజన్ కారణంగా సినిమా బడ్జెట్ ప్లాన్‌ను మించిపోయింది. దీంతో ఖర్చు రికవరీపై ఆందోళనలు నెలకొన్నాయి.

ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్, సంయుక్త హీరోయిన్లుగా నటిస్తుండగా, బాలకృష్ణ డ్యూయల్ రోల్‌లో కనిపించ నున్నారు. 14 రీల్స్ ప్లస్ నిర్మాణంలో, బాలకృష్ణ కూతురు తేజస్విని ప్రజెంట్ చేస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. మొదటి భాగాన్ని మించే రీతిలో ఈ సినిమాలోని కథాంశాన్ని, యాక్షన్ సన్నివేశాల్ని తీర్చిదిద్దారట మేకర్స్. మరి ‘అఖండ 2’ మూవీ ఏ రేంజ్ లో సక్సెస్ అవుతుందో చూడాలి.

Tags

Next Story