‘అఖండ 2’ కు అదిరిపోయే బడ్జెట్ !

నటసింహం నందమూరి బాలకృష్ణ.. మరోసారి బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో కొలాబరేట్ అయిన సంగతి తెలిసిందే. ఈసారి వీళ్లిద్దరూ తీసుకొస్తున్నది ‘అఖండ 2’ అనే ఓ హై-ఓక్టేన్ యాక్షన్ డ్రామా. ఇది ఈ ఏడాది సెప్టెంబర్ 25న థియేటర్లలో రచ్చ చేయడానికి రెడీ అవుతోంది. తాజా బజ్ ఏంటంటే... ఈ సినిమా బాలయ్య కెరీర్‌లోనే ఇప్పటివరకూ అత్యధిక బడ్జెట్‌తో, ఏకంగా రూ. 180 కోట్లతో రూపొందుతుండడం విశేషం.
ఈ భారీ బడ్జెట్ లో లయన్ షేర్ నాన్-థియేట్రికల్ రైట్స్ (ఓటీటీ, శాటిలైట్, డిజిటల్ రైట్స్) ద్వారా వసూలు కానుందని టాక్. అంటే, సినిమా రిలీజ్‌కి ముందే మంచి రికవరీ జరిగే అవకాశం ఉంది. బాలయ్య-బోయపాటి కాంబో అంటేనే గతంలో ‘సింహా, లెజెండ్, అఖండ’ లాంటి సూపర్ హిట్స్ గుర్తొస్తాయి. ఆ సినిమాల్లో బాలయ్య మాస్ ఎనర్జీ, బోయపాటి పవర్‌ఫుల్ స్టోరీటెల్లింగ్, హై-ఇంటెన్సిటీ యాక్షన్ సీక్వెన్స్‌లు ఆడియన్స్‌ను ఫిదా చేశాయి. ఇప్పుడు ‘అఖండ 2’ సినిమాపై కూడా అభిమానుల అంచనాలు ఆకాశమే హద్దు అన్నట్టుగా ఉన్నాయి.
ఇంత పెద్ద బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా, బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ రాబట్టాల్సి ఉంది. బాలయ్య మాస్ ఫాలోయింగ్, బోయపాటి యాక్షన్ డ్రామాలకు తిరుగులేని క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని, నిర్మాతలు ఈ చిత్రాన్ని గ్రాండ్ స్కేల్‌లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఓవైపు బాలయ్య డైలాగ్ డెలివరీ, మరోవైపు బోయపాటి సిగ్నేచర్ యాక్షన్ బ్లాక్స్‌తో ఈ సినిమా థియేటర్లలో పండగ చేయడం పక్కా అని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.
-
Home
-
Menu