
‘అఖండ 2’ రిలీజ్ డేట్ లాక్ అయింది

నటసింహం నందమూరి బాలకృష్ణ, మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను నాలుగో సారి కొలాటరేట్ అవుతున్న హైఓల్టేజ్ యాక్షన్ మూవీ ‘అఖండ 2: తాండవం’ అధికారికంగా దాని విడుదల తేదీని ప్రకటించింది. బ్లాక్‌బస్టర్ చిత్రం “అఖండ” కి సీక్వెల్‌గా వస్తున్న ఈ మోస్ట్ అవైటెడ్ మూవీ ఈ ఏడాది డిసెంబర్ 5 న థియేటర్లలోకి రానుంది.
ప్రస్తుతం పోస్ట్-ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమా వాస్తవానికి ఈరోజే విడుదల కావాల్సి ఉంది. కానీ పవన్ కళ్యాణ్ “ఓజీ” చిత్రం కోసం వాయిదా పడింది. ఇప్పుడు “ఓజీ” థియేటర్లలో విజయవంతంగా నడుస్తున్న నేపథ్యంలో.. మేకర్స్ ఈ బాలకృష్ణ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కు కొత్త తేదీని ఖరారు చేశారు. “అఖండ 2” ప్రమోషన్లు వచ్చే నెలలో ప్రారంభం కానున్నాయి.
బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ యాక్షన్-ప్యాక్డ్ భక్తిరస డ్రామాలో ప్రగ్యా జైస్వాల్, సంయుక్త, మరియు ఆది పినిశెట్టి కూడా నటించారు. దీనికి థమన్ సంగీతం అందించగా, 14 రీల్స్ ప్లస్ నిర్మిస్తోంది. మరి అఖండ 2 బాలయ్య తాండవం ఏ రేంజ్ లో ఉండబోతుందో చూడాలి.
-
Home
-
Menu