'అఖండ 2'.. మాస్ మ్యూజిక్ బ్లాస్ట్!

గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. వరుసగా ఘన విజయాలు అందుకుంటూ ఫ్యాన్స్ ను ఖుషీ చేస్తున్నాడు. ఇదే ఊపులో ఇప్పుడు 'అఖండ 2'తో ఆడియన్స్ ముందుకు రానున్నాడు. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన 'అఖండ' భారీ విజయం సాధించడంతో పార్ట్ 2పై అంచనాలు తారా స్థాయికి వెళ్లాయి. ప్రస్తుతం చిత్రీకరణ వేగంగా కొనసాగుతుండగా, బాలయ్యపై వరుసగా సాలిడ్ యాక్షన్ సీక్వెన్స్‌లు తెరకెక్కిస్తున్నారు.
ఇక సంగీత విభాగంలో ఎప్పుడూ హై ఎనర్జీతో ఉండే తమన్, 'అఖండ 2'కు సౌండింగ్ మామూలుగా ఉండదని హామీ ఇస్తున్నాడు. 'అఖండ'లో అతని బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించింది. మరి పార్ట్ 2లో ఆ మ్యాజిక్ రిపీట్ అవుతుందా? అంటే అభిమానులు ఖచ్చితంగా ‘అవును’ అంటున్నారు.
లేటెస్ట్ గా సోషల్ మీడియాలో 'అఖండ'లోని ఓ సన్నివేశాన్ని పోస్ట్ చేసిన ఫ్యాన్స్.. 'అఖండ 2' మరో రేంజులో ఉండబోతుందని హింట్ ఇచ్చారు. దానికి తమన్ 'దిస్ ఈజ్ హై' అంటూ రిప్లై ఇవ్వడంతో 'అఖండ 2'కి తమన్ ఎలాంటి మ్యూజిక్ ఇవ్వబోతున్నాడా? అనే ఊహాగానాలు పెరుగుతున్నాయి. మొత్తంగా 'అఖండ 2'తో మరోసారి బాలయ్య-బోయపాటి కాంబో బాక్సాఫీస్ రికార్డులను తిరిగరాస్తుందనే అంచనాలు మొదలయ్యాయి.
-
Home
-
Menu