అజిత్ ‘పట్టుదల’ చిత్రానికి సెన్సార్ పూర్తి !

అజిత్ ‘పట్టుదల’ చిత్రానికి సెన్సార్ పూర్తి !
X
పట్టుదల చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకొంది. దీనికి సెన్సార్ సభ్యులు యు / ఏ సర్టిఫికేట్ జారీ చేశారు.

తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ ఇటీవల పద్మ భూషణ్ పురస్కారాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న భారీ యాక్షన్ డ్రామా “విడాముయర్చి” తెలుగులో “పట్టుదల” పేరుతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకొంది. దీనికి సెన్సార్ సభ్యులు యు / ఏ సర్టిఫికేట్ జారీ చేశారు.

“పట్టుదల” సినిమాకి మాగిళ్ తిరుమేని దర్శకత్వం వహించగా.. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై సుభాస్కరన్ నిర్మించారు. ఈ చిత్రం ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌లో అజిత్ కుమార్ అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్‌లతో ఆకట్టుకుంటున్నాడు. ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో మెప్పించడంతో పాటు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ చిత్రంలో త్రిష కృష్ణన్ కథానాయికగా నటించగా.. యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా విలన్ గా కనిపించనున్నాడు. రెజీనా కసాండ్రా, అరవ్, నిఖిల్ నాయర్, దాశరథి, గణేశ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని అందించాడు. మరి ఈ సినిమా అజిత్ కు ఏ రేంజ్ లో ఇమేజ్ తెచ్చిపెడుతుందో చూడాలి.

Tags

Next Story