పోర్చుగల్ రేసింగ్‌లో అజిత్ కు ప్రమాదం!

పోర్చుగల్ రేసింగ్‌లో అజిత్ కు ప్రమాదం!కోలీవుడ్ స్టార్ అజిత్ సినిమాలకే పరిమితం కాకుండా కార్ రేసింగ్‌లోనూ చురుగ్గా పాల్గొంటున్నాడు. ఇటీవలే దుబాయ్‌లో రేసింగ్ చేస్తూ ప్రమాదానికి గురయ్యాడు. ఆ తర్వాత కోలుకుని దుబాయ్ రేసింగ్ లో మూడో స్థానం దక్కించుకున్నాడు. ఈ విజయానికి గుర్తింపుగా ‘లిబర్టీ ఆఫ్ ది గేమ్’ అవార్డు కూడా అందుకున్నాడు.
లేటెస్ట్ గా పోర్చుగల్‌లోని ఎస్టోరిల్ ట్రాక్‌లో శిక్షణ సమయంలో మరో చిన్న ప్రమాదానికి గురయ్యాడు. అయితే అదృష్టవశాత్తూ ఈ ఘటనలో అజిత్‌కు ఎటువంటి గాయాలు కాలేదు. రేసింగ్‌లో ఎదురయ్యే అడ్డంకులను అధిగమించి మళ్లీ గెలిచే నమ్మకంతో ఉన్నానని అజిత్ వెల్లడించాడు. అజిత్ రేసింగ్ ప్యాషన్‌ను చూసి ఆయన అభిమానులు గర్వపడుతున్నారు.
ఇదిలావుంటే ఇటీవల అజిత్ నటించిన 'విడాముయార్చి' విడుదలైంది. ఈ సినిమా తెలుగులో 'పట్టుదల' పేరుతో వచ్చింది. అయితే ఈ చిత్రానికి బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ రెస్పాన్స్ మాత్రమే దక్కింది. త్వరలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న 'గుడ్ బ్యాడ్ అగ్లీ' మూవీతో ఆడియన్స్ ను పలకరించనున్నాడు అజిత్.
-
Home
-
Menu