అన్నయ్య కూడా గ్యాంగ్ స్టరేనా?

అన్నయ్య కూడా గ్యాంగ్ స్టరేనా?
X
‘వాల్తేరు వీరయ్య’ తర్వాత డైరెక్టర్ బాబీ మరోసారి చిరంజీవితో కొలాబరేట్ కాబోతున్నాడు. ఈసారి మెగాస్టార్‌ని పూర్తి స్థాయి గ్యాంగ్‌స్టర్ లుక్‌లో చూపించ బోతున్నట్టు టాక్.

మెగాస్టార్ చిరంజీవి బర్త్‌డే సమీపిస్తోంది. అభిమానులు ఆయన సినిమాల అప్‌డేట్స్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 'విశ్వంభర' టీజర్ ఆయన పుట్టినరోజున రిలీజ్ అవుతుందని ఇప్పటికే కన్ఫర్మ్ అయింది. అలాగే అనిల్ రావిపూడి సినిమా నుంచి మరో బిగ్ సర్‌ప్రైజ్ కూడా రాబోతోంది. అయితే, ఇంతటితో ఆగడం లేదు. మూడో సర్‌ప్రైజ్ కూడా సిద్ధంగా ఉందని టాక్ నడుస్తోంది.

‘వాల్తేరు వీరయ్య’ తర్వాత డైరెక్టర్ బాబీ మరోసారి చిరంజీవితో కొలాబరేట్ కాబోతున్నాడు. ఈసారి మెగాస్టార్‌ని పూర్తి స్థాయి గ్యాంగ్‌స్టర్ లుక్‌లో చూపించ బోతున్నట్టు టాక్. ఇది స్క్రీన్‌పై కచ్చితంగా ఫైర్ పుట్టించబోతోంది. మరోవైపు, పవన్ కళ్యాణ్ కూడా తన రాబోయే సినిమా 'ఓజీ'లో గ్యాంగ్‌స్టర్ రోల్‌లో కనిపించనున్నారు. ఇద్దరు మెగా హీరోలు గ్యాంగ్‌స్టర్ అవతారాల్లో రాబోతుంటే, అభిమానులకు ఇది డబుల్ ధమాకా విందు అన్నమాట.

కేవీయన్ ప్రొడక్షన్స్ ఈ భారీ ప్రాజెక్ట్‌ని భారీ బడ్జెట్‌తో నిర్మించబోతోంది. సినిమా లాంఛనం చిరంజీవి బర్త్‌డే రోజే మొదలవుతుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. అధికారిక ప్రకటన వచ్చే వరకు అభిమానులు ఉత్కంఠతో ఎదురుచూడాల్సిందే.

Tags

Next Story