‘అది దా సర్‌ప్రైజు’.. కేతిక స్పెషల్ డ్యాన్స్ నంబర్!

ఈనెలలో రాబోతున్న సినిమాలలో నితిన్ 'రాబిన్‌హుడ్'ని ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఒకవేళ పవన్ కళ్యాణ్ 'హరిహర వీరమల్లు' రాకపోతే.. మార్చి నెలకు పెద్ద సినిమా 'రాబిన్‌హుడ్' కాబోతుంది. నితిన్, శ్రీలీల జంటగా వెంకీ కుడుమల ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. మైత్రీ మూవీ మేకర్స్ నుంచి ఫుల్ లెన్త్ ఎంటర్‌టైనర్‌గా మార్చి 28న ఈ సినిమా విడుదలకు ముస్తాబవుతుంది.
జి.వి.ప్రకాష్ కుమార్ సంగీతాన్ని సమకూరుస్తున్న 'రాబిన్‌హుడ్' నుంచి ఇప్పటికే విడుదలైన 'ఒన్ మోర్ టైమ్, వేరెవర్ యు గో' రెండూ ఇన్‌స్టెంట్ గా హిట్ అయ్యాయి. ఇప్పుడు ఈ మూవీ నుంచి థర్డ్ సింగిల్ రాబోతుంది. అది కూడా స్పెషల్ నంబర్. ‘అది దా సర్‌ప్రైజు’ అంటూ సాగే ఈ గీతంలో గ్లామరస్ బ్యూటీ కేతిక శర్మ అదిరిపోయే డాన్స్‌తో అలరించనుందట. మార్చి 10న ఈ పాట విడుదల కాబోతుంది. మొత్తంగా కంప్లీట్ కమర్షియల్ ప్యాకేజ్ తో 'రాబిన్‌హుడ్' ఈనెల చివరిలో థియేటర్లలోకి దిగుతోంది.
‘Adi Da Surprise’.. Kethika Special Dance Number!
-
Home
-
Menu