అభినయ పెళ్ళి వేదిక అక్కడేనా?

ప్రముఖ దక్షిణాది నటి అభినయ తన చిరకాల ప్రేమికుడు వేగేశ్న కార్తిక్, అలియాస్ సన్ని వర్మతో మార్చి 9, 2025న ఎంగేజ్‌మెంట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రకటించిన అభినయ.. తమ నిశ్చితార్థ ఫోటోలు పంచుకోవడంతో పాటు తన కాబోయే జీవిత భాగస్వామిని ప్రపంచానికి పరిచయం చేసింది. ఆమె ప్రేమను గెలుచుకున్న కార్తిక్‌ను కొందరు అభిమానులు ముద్దుగా "లక్కీయెస్ట్ మ్యాన్ ఇన్ ది వరల్డ్" అని పేర్కొన్నారు.
కార్తిక్ తెలుగునాట పేరుగాంచిన వ్యాపారవేత్త కావడంతో.. ఈ వార్త విశేష చర్చనీయాంశమైంది. అభినయ-కార్తిక్ వివాహ వేడుక భీమవరం లేదా చెన్నైలో జరుగుతుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా.. కార్తిక్ భీమవరం ప్రాంతానికి చెందిన వ్యక్తి కావడంతో అక్కడే పెళ్లి జరిగే అవకాశముందని అంటున్నారు. వివిధ వ్యాపారాలను నిర్వహిస్తున్న కార్తిక్, వ్యాపార రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు.
ఈ ఎంగేజ్‌మెంట్ ద్వారా అభినయ ఓ పక్క తన ప్రేమ కథను ప్రపంచానికి తెలియజేయగా.. మరోపక్క కొంతకాలంగా ఆమె ఓ తమిళ సినీ నటుడిని పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలకు చెక్ పెట్టినట్టు అయింది. ఆమె అభిమానులు, సినీ ప్రముఖులు పెద్ద ఎత్తున అభినయకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
-
Home
-
Menu