అభినయన పెళ్ళి ముహూర్తం ఫిక్స్ ?

అభినయన పెళ్ళి ముహూర్తం ఫిక్స్ ?
X
ఈ జంట ఈ నెల 16న సంప్రదాయ హిందూ వేదిక్ ముహూర్తంలో పెళ్లి పీటలు ఎక్కనున్నట్లు తెలుస్తోంది. అభినయ ఈ విషయాన్ని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు గానీ, సోషల్ మీడియా వర్గాల్లో ఏప్రిల్ 16నే పెళ్లి ముహూర్తమని జోరుగా ప్రచారం జరుగుతోంది.

దక్షిణాది నటీమణి అభినయ తన తన బాయ్ ఫ్రెండ్ వేగేశ్న కార్తిక్ అలియాస్ సన్నీ వర్మతో తన నిశ్చితార్థ వివరాలను ఇటీవల ప్రకటించింది. ఈ తెలుగు యువకుడు గత 15 సంవత్సరాలుగా అభినయతో ప్రేమలో ఉన్నాడు. అతని ప్రతిపాదనకు ఆమె వెంటనే సమ్మతం తెలిపిందని ఆమె వెల్లడించింది. మార్చి 9న తన నిశ్చితార్థాన్ని అధికారికంగా ప్రకటించిన అభినయ త్వరలో వివాహ బంధానికి సిద్ధమవుతోంది.

తాజా సమాచారం ప్రకారం... ఈ జంట ఈ నెల 16న సంప్రదాయ హిందూ వేదిక్ ముహూర్తంలో పెళ్లి పీటలు ఎక్కనున్నట్లు తెలుస్తోంది. అభినయ ఈ విషయాన్ని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు గానీ, సోషల్ మీడియా వర్గాల్లో ఏప్రిల్ 16నే పెళ్లి ముహూర్తమని జోరుగా ప్రచారం జరుగుతోంది.

ఇదిలా ఉంటే... మాటల ద్వారా సంభాషించలేని అభినయ సంకేత భాష ద్వారా మాత్రమే కమ్యూనికేట్ చేస్తుంది. అయినప్పటికీ, ఆమె సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండి తన తాజా ఫోటోలను పంచుకుంటోంది. ఇటీవలే ఆమె వైట్ డెనిమ్, ఇండియన్ స్టైల్ టాప్, హై హీల్డ్ బూట్స్ ధరించి దిగిన ఫోటోలను షేర్ చేసింది. అభినయ ప్రేమ కథ, వ్యక్తిత్వం, తనకున్న ప్రత్యేకతతో ఎంతోమంది అభిమానులను ఆకట్టుకుంటూ, తన జీవితాన్ని స్ఫూర్తిగా మార్చుకుంటోంది.

Tags

Next Story