హిమాలయాలకు మరోసారి ప్రయాణం!

హిమాలయాలకు మరోసారి ప్రయాణం!
X

ఈ మార్చి నెల రీరిలీజుల కోసం అనువైన మాసంగా భావిస్తున్నారు మేకర్స్. విద్యార్థులకు పరీక్షల కాలం కావడంతో గతంలో హిట్టైన కొన్ని సినిమాలు ఈ నెలలో మళ్లీ థియేటర్లలోకి వస్తున్నాయి. ఈ లిస్టులో నాని-విజయ్ దేవరకొండ 'ఎవడే సుబ్రహ్మణ్యం' ఒకటి. 'కల్కి'తో పాన్ ఇండియా డైరెక్టర్ అనిపించుకున్న నాగ్ అశ్విన్ తొలి చిత్రమిది.

ఈ సినిమా కథ విషయానికొస్తే సుబ్రహ్మణ్యం (నాని) ఒక కఠినమనస్కుడైన కార్పొరేట్ ప్రొఫెషనల్. అతని జీవితంలో గెలుపు, డబ్బు, ఎదుగుదలే ముఖ్యమై ఉంటాయి. కానీ, అతని చిన్ననాటి స్నేహితుడు రిషి (విజయ్ దేవరకొండ) మాత్రం జీవితాన్ని ఎంతో సరదాగా ఆస్వాదిస్తుంటాడు. రిషి తన కలల ప్రయాణం కోసం హిమాలయాలకు వెళ్ళాలనుకుంటాడు. కొన్ని సంఘటనల కారణంగా సుబ్రహ్మణ్యం కొత్తగా పరిచయం అయిన ఆనంది (మాళవిక నాయర్)తో కలిసి హిమాలయాల్లోని దూద్‌కాశికి వెళతాడు. ఈ యాత్రలో సుబ్రహ్మణ్యం జీవితం గురించి తన అవగాహనను పూర్తిగా మార్చుకుంటాడు.

2015, మార్చి 21న విడుదలైన 'ఎవడే సుబ్రహ్మణ్యం' మంచి విజయాన్ని సాధించింది. ఇప్పుడు మళ్లీ పదేళ్ల తర్వాత ఈ మార్చి 21న మళ్లీ థియేటర్లలోకి వస్తోంది. ఈ సందర్భంగా ఇటీవల మూవీ టీమ్ మళ్లీ కలుసుకుంది. అలాగే 'ఎవడే సుబ్రహ్మణ్యం' రీరిలీజ్ ప్రమోషన్స్ ను జోరుగా నిర్వహించడానికి సన్నాహాలు చేస్తుంది టీమ్.

Tags

Next Story