2026 సంక్రాంతి సినిమాల లైనప్ ఇదే !

సంక్రాంతి 2026 క్యాలెండర్ దాదాపు ఫైనల్ అయింది. మూడు పెద్ద తెలుగు సినిమాలు, ఒక తమిళ రిలీజ్‌తో బాక్సాఫీస్ వద్ద గట్టి పోటీ ఏర్పడనుంది. చిరంజీవి, ప్రభాస్, విజయ్, నవీన్ పొలిశెట్టి ఈ పండగ సీజన్‌లో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించేందుకు రెడీ అవుతున్నారు.
మన శంకర వరప్రసాద్ గారు
మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ అనిల్ రావిపూడితో కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ “మన శంకర వరప్రసాద్ గారు”. ఈ సినిమా ఎప్పుడో సంక్రాంతి స్లాట్‌ను ఖరారు చేసింది. నిజానికి “విశ్వంభర” ఈ పండగ సీజన్‌లో వస్తుందని, రావిపూడి సినిమా సమ్మర్‌కి వెళ్తుందని టాక్ నడిచింది. కానీ, ఇప్పుడు మేకర్స్ ఈ మార్పును క్లారిఫై చేశారు. అనిల్ రావిపూడి గతంలో ‘ఎఫ్ 2, సరిలేరు నీకెవ్వరు, సంక్రాంతికి వస్తున్నాం’ వంటి సంక్రాంతి హిట్స్ ఇచ్చారు. ఈ సెంటిమెంట్‌తోనే “పండగకి వస్తున్నారు” అనే ట్యాగ్‌లైన్‌తో ఈ సినిమాను ఫెస్టివ్ ఎంటర్‌టైనర్‌గా తీసుకొస్తున్నారు.
ది రాజా సాబ్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న హారర్ కామెడీ చిత్రం “ది రాజా సాబ్”. మారుతి రూపొందిస్తున్న ఈ చిత్రం మొదట డిసెంబర్ 5, 2025న రిలీజ్ కావాల్సి ఉంది. కానీ, ఇప్పుడు ఇది జనవరి 10, 2026కి సంక్రాంతి రేసులోకి వచ్చింది. ఇది ప్రభాస్, చిరంజీవిల మధ్య తొలి డైరెక్ట్ ఫెస్టివల్ క్లాష్. ప్రభాస్‌కి దాదాపు దశాబ్దం తర్వాత సంక్రాంతి రిలీజ్ ఇది. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ నటిస్తున్న ఈ సినిమా ఈ సీజన్‌లోనే బిగ్గెస్ట్ రిలీజ్‌గా నిలుస్తోంది.
అనగనగా ఒక రాజు
నవీన్ పొలిశెట్టి “అనగనగా ఒక రాజు” కూడా సంక్రాంతికి వస్తోంది. స్కేల్ పరంగా చిన్న సినిమా అయినా, మేకర్స్ దీని అప్పీల్‌పై ధీమాగా ఉన్నారు. దాదాపు మూడేళ్లుగా నిర్మాణంలో ఉన్న ఈ సినిమా, 2025 ఏప్రిల్ నుంచే ఈ స్లాట్‌ను లాక్ చేసింది. ఆలస్యం అనేది ఇక అసాధ్యం. మీనాక్షి చౌదరి ఈ చిత్రంలో నటిస్తోంది. ఆమె 2025 సంక్రాంతికి బిగ్గెస్ట్ హిట్ సాధించింది. ఈ టీమ్ ఆ విజయాన్ని మళ్లీ రిపీట్ చేయాలని భావిస్తోంది.
జన నాయగన్
తలపతి విజయ్ నటిస్తున్న “జన నాయగన్” భారీ బజ్‌తో వస్తోంది. ఇది విజయ్ ఫుల్-టైమ్ పాలిటిక్స్‌లోకి వెళ్లే ముందు చివరి సినిమాగా చెబుతున్నారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని సీట్లలో తన పార్టీ పోటీ చేస్తున్న నేపథ్యంలో, ఈ సినిమా సినిమా రంగానికి గ్రాండ్ ఫేర్‌వెల్‌గా నిలవనుంది. తమిళనాడులో ఈ చిత్రం జోరు చూపించనుంది. కానీ, తెలుగులో రిలీజ్ అనిశ్చితంగా ఉంది, ఎందుకంటే దీని కథ బాలకృష్ణ “భగవంత్ కేసరి”ని పోలి ఉంటుందని టాక్.
-
Home
-
Menu