సైనికుల కోసం ముందుకొచ్చిన టాలీవుడ్

టాలీవుడ్ ఎప్పుడూ ప్రజల కష్టసుఖాల్లో భాగమవుతుంది. విపత్కర పరిస్థితుల్లో సహాయం చేయడంలో సినీ పరిశ్రమ ముందుంటుందన్న విషయం మరోసారి ప్రూవైంది. భారత్-పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ, గీతా ఆర్ట్స్ అధినేత, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ చేసిన ప్రకటన అందరికీ ఆదర్శంగా నిలిచింది.
శ్రీ విష్ణు హీరోగా తెరకెక్కిన 'సింగిల్' చిత్రం ఈరోజు విడుదలై మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ విజయాన్ని పురస్కరించుకుని జరిగిన సక్సెస్ మీట్‌లో అల్లు అరవింద్ 'భారత్ మాతా కీ జై' అంటూ దేశభక్తిని ఉజ్జ్వలంగా దేశభక్తిని వ్యక్తపరిచారు. ఈ సినిమాతో వచ్చిన లాభాల్లో భాగాన్ని మన భారత సైనికుల సంక్షేమం కోసం విరాళంగా ఇవ్వనున్నట్టు ప్రకటించారు.
మరోవైపు రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ సైతం మన సైనికుల కోసం ఆపన్న హస్తం అందించబోతున్నాడు. తన రౌడీ వేర్ బ్రాండ్ లాభాల్లో నుంచి కొంత వాటా భారత సైన్యానికి విరాళం ఇస్తున్నట్లు ప్రకటించాడు హీరో విజయ్ దేవరకొండ.
-
Home
-
Menu