విశాల్ సినిమాకి టైటిల్ ఫిక్స్

విశాల్ సినిమాకి టైటిల్ ఫిక్స్
X
కోలీవుడ్ యాక్షన్ హీరో విశాల్ కెరీర్‌లో 35వ చిత్రానికి టైటిల్ ఖరారైంది. ఈ సినిమాకి 'మకుటం' అనే ఆసక్తికరమైన టైటిల్ ను ఫిక్స్ చేశారు. రవి అరసు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ సూపర్ గుడ్ ఫిల్మ్స్ నిర్మిస్తుంది.

కోలీవుడ్ యాక్షన్ హీరో విశాల్ కెరీర్‌లో 35వ చిత్రానికి టైటిల్ ఖరారైంది. ఈ సినిమాకి 'మకుటం' అనే ఆసక్తికరమైన టైటిల్ ను ఫిక్స్ చేశారు. రవి అరసు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ సూపర్ గుడ్ ఫిల్మ్స్ నిర్మిస్తుంది. జూలైలో షూటింగ్ మొదలుపెట్టుకున్న ఈ మూవీలో అంజలి, దుషారా విజయన్ ఫీమేల్ లీడ్స్ లో కనిపించబోతున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు.

లేటెస్ట్ గా రిలీజైన టైటిల్ టీజర్ ఆకట్టుకుంటుంది. ఈ గ్లింప్స్ చూస్తుంటే ఈ మూవీ సముద్రం బ్యాక్‌డ్రాప్‌లో సాగే కథాంశంగా తెలుస్తోంది. ఓ పోర్ట్‌బ్యాక్‌డ్రాప్ లో విశాల్ వైట్ సూట్ లో ఆకట్టుకుంటున్నాడు. ఈ ఏడాది పొంగల్ బరిలో 'మదగజరాజా' చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్నాడు విశాల్. వాస్తవానికి ఈ సినిమా 12 ఏళ్ల క్రితమే పూర్తయ్యింది కానీ విడుదల ఆలస్యమైంది. అయినా.. 'మదగజరాజా' ఘన విజయాన్ని సాధించింది.



Tags

Next Story