ప్రసాద్ ఐమాక్స్‌లో టైం ట్రావెల్ మెషిన్

తెలుగు చలనచిత్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన చిత్రాల్లో 'ఆదిత్య 369'ది ప్రత్యేక స్థానం. 1991లో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను టైం ట్రావెల్ అనే కొత్త కాన్సెప్ట్‌తో పరవశింపజేసింది. నందమూరి బాలకృష్ణ ద్విపాత్రాభినయంతో మురిపించిన ఈ మూవీ దర్శకుడు సింగీతం శ్రీనివాస రావు విజన్‌కు అద్భుతమైన నిదర్శనం.
‘ఆదిత్య 369‘ ఇప్పుడు 4K రీజల్యూషన్‌లో మళ్ళీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఫ్యాన్స్‌కు ఈ అనుభూతిని మరింత ప్రత్యేకం చేయడానికి, హైదరాబాద్‌లోని ప్రసాద్ ఐమాక్స్ వద్ద ఓ అద్భుతమైన ఏర్పాటును చేశారు. సినిమా కాన్సెప్ట్‌ను ప్రతిబింబిస్తూ టైం ట్రావెల్ మిషన్‌ను అక్కడ ప్రదర్శనకు ఉంచారు. ఇది ప్రేక్షకులకు, ముఖ్యంగా చిన్నారులకు పెద్ద ఆకర్షణగా మారింది.
ఒక కొత్త సినిమాని విడుదల చేస్తున్న రీతిలో ఈ సినిమా ప్రచారాన్ని నిర్వహిస్తుంది నిర్మాణ సంస్థ శ్రీదేవి మూవీస్. ఈ చిత్రంకోసం గ్రాండ్ లెవెల్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. అలాగే ఈ మూవీని ఏకంగా 220 థియేటర్లలో రిలీజ్ చేశారు.
-
Home
-
Menu