తెలుగులో ‘థగ్ లైఫ్‘ ప్రమోషన్స్

తెలుగులో ‘థగ్ లైఫ్‘ ప్రమోషన్స్
X
నేటితరం సీనియర్ హీరోస్ లో విశ్వనటుడు కమల్ హాసన్ రూటే సెపరేటు. ఏడుపదుల వయసు దాటినా కుర్ర హీరోలకు ధీటుగా స్టంట్స్ లో చెలరేగిపోతున్నాడు. మరోవైపు ‘పొన్నియిన్ సెల్వన్’ సిరీస్‌తో తిరిగి ఫామ్‌లోకి వచ్చిన మణిరత్నం.. లాంగ్ గ్యాప్ తర్వాత కమల్ హాసన్‌తో పనిచేస్తున్న చిత్రం ‘థగ్ లైఫ్‘.

నేటితరం సీనియర్ హీరోస్ లో విశ్వనటుడు కమల్ హాసన్ రూటే సెపరేటు. ఏడుపదుల వయసు దాటినా కుర్ర హీరోలకు ధీటుగా స్టంట్స్ లో చెలరేగిపోతున్నాడు. మరోవైపు ‘పొన్నియిన్ సెల్వన్’ సిరీస్‌తో తిరిగి ఫామ్‌లోకి వచ్చిన మణిరత్నం.. లాంగ్ గ్యాప్ తర్వాత కమల్ హాసన్‌తో పనిచేస్తున్న చిత్రం ‘థగ్ లైఫ్‘. ఈ సినిమాలో శింబు, త్రిష వంటి వారు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.

1987లో వచ్చిన ‘నాయకుడు‘ తర్వాత కమల్-మణిరత్నం కాంబోలో రాబోతున్న సినిమా కావడంతో ‘థగ్ లైఫ్‘పై భారీ అంచనాలున్నాయి. అటు తమిళంతో పాటు.. తెలుగులోనూ ‘థగ్ లైఫ్‘ను భారీ స్థాయిలో విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తున్నారు.

జూన్ 5న రిలీజ్ కు రెడీ అవుతున్న ‘థగ్ లైఫ్‘ ప్రచారంలో స్పీడు పెంచుతున్నారు మేకర్స్. తెలుగు రాష్ట్రాల్లోనూ వరుసగా ప్రమోషనల్ ఈవెంట్స్ ప్లాన్ చేశారు. ‘థగ్ లైఫ్‘ ట్రైలర్ ను మే 17న విడుదల చేయబోతున్నారు. ఇక హైదరాబాద్ లో మే 24న హైదరాబాద్‌లో గ్రాండ్‌గా ఆడియోని లాంఛ్ చేయనున్నారు. ఆ తర్వాత మే 29న విశాఖపట్నంలో తెలుగు వెర్షన్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. మొత్తంగా.. ఓ స్ట్రెయిట్ మూవీని ప్రమోట్ చేసే రీతిలో ‘థగ్ లైఫ్‘ను తెలుగులోకి తీసుకొస్తున్నారు మేకర్స్.

Tags

Next Story