ఒకే ఫ్రేములో ముగ్గురు లెజెండ్స్

చిరంజీవి జగదేకవీరుడిగా, శ్రీదేవి అతిలోకసుందరిగా ప్రేక్షకుల్ని ఫాంటసీ వరల్డ్ లోకి తీసుకెళ్లిన చిత్రం ‘జగదేకవీరుడు అతిలోకసుందరి‘. 35 ఏళ్ల తర్వాత ఈ ఎవర్ గ్రీన్ క్లాసిక్ మళ్లీ థియేటర్లలోకి వస్తోంది. మే 9న ఈ చిత్రం విడుదల సందర్భంగా.. ముగ్గురు లెజెండ్స్ హీరో చిరంజీవి, డైరెక్టర్ రాఘవేంద్రరావు, ప్రొడ్యూసర్ అశ్వనీదత్ ఒకే వేదిక పైకి వచ్చారు.
‘జగదేకవీరుడు అతిలోకసుందరి‘ రీ రిలీజ్ సందర్భంగా చిరు, అశ్వనీదత్, రాఘవేంద్రరావు కలిసి ఓ ప్రత్యేకమైన ఇంటర్యూ ఇచ్చారు. త్వరలోనే ఈ ఇంటర్యూను విడుదల చేయనుంది నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్. మొత్తంగా.. మూడున్నర దశాబ్దాల క్రితం ప్రేక్షకుల్ని ఫాంటసీ ప్రపంచంలోకి తీసుకెళ్లిన ‘జగదేకవీరుడు అతిలోకసుందరి‘ ఇప్పుడు త్రీడిలో సరికొత్తగా నేటితరం ప్రేక్షకుల కోసం సిద్ధమైంది. మరి.. రీ రిలీజులో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో చూడాలి.
The Trio of #JVAS comes together for something truly unforgettable that will take you back in time.#JagadekaVeeruduAthilokaSundari back on the big screens after 35 years, in 2D & 3D this May 9th!@KChiruTweets @Ragavendraraoba #Sridevi @ilaiyaraaja @AshwiniDuttCh… pic.twitter.com/h2dIky14wV
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) May 6, 2025
-
Home
-
Menu