బన్నీకి జోడీగా ముగ్గురు భామలు!

'పుష్ప 2' వంటి ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కొత్త సినిమాని షురూ చేయబోతున్నాడు. కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. అత్యంత భారీ బడ్జెట్‌తో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ మూవీ అత్యాధునిక వీఎఫ్ఎక్స్‌తో రూపొందుతుంది.
ఈ సినిమాలో మరో విశేషమేమిటంటే అల్లు అర్జున్ డ్యూయెల్ రోల్ లో సందడి చేయనున్నాడట. ఫస్ట్ టైమ్ బన్నీ కెరీర్ లో డబుల్ రోల్ చేయబోతున్నాడు. ఇక ఈ చిత్రంలో హీరోయిన్స్ ఒకరు, ఇద్దరు కాదు ముగ్గురు ఉండబోతున్నారట. ఇప్పటికే 'సీతారామం' బ్యూటీ మృణాల్ ఠాకూర్ ని ఒక నాయికగా ఎంపిక చేసినట్టు ప్రచారం జరుగుతుంది. ఆమెకు లుక్ టెస్ట్ కూడా పూర్తైందట.
రెండో నాయికగా జాన్వీ కపూర్ పేరు ప్రచారంలో ఉంది. మృణాల్, జాన్వీలతో పాటు.. మరో హీరోయిన్ ని కూడా ఈ సినిమాకోసం తీసుకోనున్నాడట అట్లీ. ఈ చిత్రానికి యంగ్ మ్యూజికల్ సెన్సేషనల్ సాయి అభ్యంకర్ సంగీతాన్ని అందిస్తాడని తెలుస్తోంది. మొత్తంగా.. రెగ్యులర్ కమర్షియల్ ఫార్మూలాలను మించి, హై వోల్టేజ్ ఎమోషన్స్, గ్రాండ్ స్కేల్ విజువల్స్‌తో ఈ చిత్రం భారతీయ సినిమాల్లో కొత్త ఒరవడి సృష్టించే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.
-
Home
-
Menu