ఈ వారం అనువాద చిత్రాలదే!

సమ్మర్ సీజన్ చివరి దశకు చేరుకుంది. ఈ హాట్ సమ్మర్ లో 'హిట్ 3, సింగిల్' వంటి చిత్రాలు మాత్రమే ఆడియన్స్ ను ఆకట్టుకున్నాయి. ఇక మే 30 నుంచి 'భైరవం' మొదలు కొని జూలై 4న 'కింగ్డమ్' వరకూ వరుసగా పెద్ద సినిమాలు బాక్సాఫీస్ కి క్యూ కడుతున్నాయి. ఈనేపథ్యంలో ఈ వారం తెలుగు నుంచి సినిమాలేవీ లేవు. రెండు అనువాద చిత్రాలు మాత్రం తెలుగు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యాయి.
రేపు (మే 23) థియేటర్లలోకి వస్తోన్న చిత్రాలలో కోలీవుడ్ మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ‘ఏస్’ ఒకటి. విజయ్ సేతుపతికి జోడీగా రుక్మిణి వసంత్ నటించింది. ఇతర కీలక పాత్రల్లో దివ్యా పిళ్లై, యోగిబాబు కనిపించనున్నారు. 7CS ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అరుముగ కుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమాను శ్రీ పద్మిణి సినిమాస్ బ్యానర్ మీద బి. శివ ప్రసాద్ తెలుగులో విడుదల చేస్తున్నారు. యాక్షన్, రొమాన్స్, ఫన్ ఇలా అన్ని రకాల ఎలిమెంట్స్ తో 'ఏస్' ఆడియన్స్ ముందుకు వస్తోంది.
రేపు విడుదలవుతోన్న చిత్రాలలో 'కేసరి చాప్టర్ 2' ఒకటి. అక్షయ్ కుమార్, మాధవన్, అనన్య పాండే ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషించారు. బ్రిటీష్ పాలనలో జరిగిన దారుణ మారణకాండ జలియన్ వాలాబాగ్ ఇతివృత్తంతో ఈ చిత్రం తెరకెక్కింది. ఇప్పటికే హిందీలో విడుదలైన ఈ సినిమా రేపు తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
-
Home
-
Menu