ఈసారి స్పెషల్ నంబర్ కాదు.. స్పెషల్ రోల్!

తెలుగులో స్పెషల్ నంబర్స్ కి కేరాఫ్ అడ్రస్ ఊర్వశి రౌతేలా. సీనియర్ హీరోలు చిరంజీవి, బాలకృష్ణ లతో మాస్ డ్యాన్సులతో మెస్మరైజ్ చేసింది. ‘డాకు మహారాజ్‘లో అయితే పోలీస్ క్యారెక్టర్ లో కనిపిస్తూనే ‘దబిడి దిబిడి‘ అంటూ పాటలో రెచ్చిపోయింది. లేటెస్ట్ గా ఊర్వశి కిట్టీలో మరో క్రేజీ ఆఫర్ చేరిందట. ఎన్టీఆర్-నీల్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ లో ఓ కీలక పాత్రలో కనిపించబోతుందట ఈ బాలీవుడ్ ముద్దుగుమ్మ.
ఇప్పటికే ఎన్టీఆర్-నీల్ మూవీ రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టుకుంది. ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్ లో తారక్ పాల్గొనడం లేదు. త్వరలో ప్రారంభమయ్యే రెండో షెడ్యూల్ నుంచి ఎన్టీఆర్ సెట్స్ లోకి అడుగు పెడతాడట. ఆ షెడ్యూల్ నుంచే ఊర్వశి కూడా ఈ షూట్ లో పాల్గొనబోతున్నట్టు తెలుస్తోంది.
ఈ సినిమాలో ఎన్టీఆర్ కి జోడీగా రుక్మిణి వసంత్ నటిస్తుంది. మలయాళీ స్టార్ టోవినో థామస్ విలన్ గా కనిపించబోతున్నాడనే ప్రచారం ఉంది. ఓల్డ్ కలకత్తా బ్యాక్ డ్రాప్ లో గోల్డెన్ ట్రయాంగిల్ అనే డ్రగ్స్ మాఫియా ఇతివృత్తంతో ప్రశాంత్ నీల్ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. వచ్చే యేడాది జనవరిలో ఎన్టీఆర్-నీల్ మూవీ విడుదలకు ముస్తాబవుతుంది.
-
Home
-
Menu