‘వీరమల్లు‘ ప్రచార పర్వం

పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు‘ విడుదలకు ముస్తాబవుతుంది. దాదాపు నాలుగు సంవత్సరాలుగా చిత్రీకరణలో ఉన్న ఈ సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తైంది. రెండు భాగాలుగా ఆడియన్స్ ముందుకు రాబోతున్న ‘హరిహర వీరమల్లు‘ ఫస్ట్ పార్ట్ ను జూన్ 12న రిలీజ్ చేస్తున్నారు.
విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో ప్రచారాన్ని మొదలు పెట్టబోతుంది టీమ్. ముందుగా మే 21న ‘హరిహర వీరమల్లు‘ గ్రాండ్ ప్రెస్ మీట్ ను నిర్వహించబోతున్నారు. అయితే ఈ ప్రెస్ మీట్ ను ఎక్కడ నిర్వహిస్తారు? పవన్ హాజరవుతాడా? లేదా? అనేది తెలియాల్సి ఉంది.
మరోవైపు.. పాన్ ఇండియా లెవెల్ లో రిలీజవుతున్న చిత్రం కావడంతో దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఈ సినిమాని ప్రమోట్ చేసే దిశగానూ ప్రయత్నాలు జరుగుతున్నాయి. త్వరలోనే ‘వీరమల్లు‘ పూర్తి స్థాయి ప్రమోషనల్ స్ట్రాటజీని ప్రకటించనుంది టీమ్.
The saga begins before the screen lights up! ⚔️🔥
— Hari Hara Veera Mallu (@HHVMFilm) May 17, 2025
Join the GRAND PRESS MEET of #HariHaraVeeraMallu on May 21st from 11:00 AM Onwards 🦅💥#HHVMonJune12th #VeeraMallu #DharmaBattle #HHVM
Powerstar @PawanKalyan @AMRathnamOfl @thedeol #SatyaRaj @AgerwalNidhhi @amjothikrishna… pic.twitter.com/gj8iWPeX8Y
-
Home
-
Menu