‘థగ్ లైఫ్’ పాటల పండగ మొదలైంది!

మూడున్నర దశాబ్దాల తర్వాత విశ్వనటుడు కమల్ హాసన్, లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం కలయికలో రూపొందుతున్న చిత్రం 'థగ్ లైఫ్'. ఈ సినిమాలో శింబు, త్రిష, ఐశ్వర్య లక్ష్మి, అశోక్ సెల్వన్, అభిరామి, జోజు జార్జ్ వంటి వారు ఇతర కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ఈ ఏడాది జూన్ 5న 'థగ్ లైఫ్' రిలీజ్ కు రెడీ అవుతుంది.
తాజాగా ఈ సినిమా ప్రచారాన్ని ఓ పాటతో మొదలు పెట్టింది టీమ్. ఈ సినిమా నుంచి ఆస్కార్ విజేత ఏ.ఆర్.రెహమాన్ స్వరపరిచిన 'జింగుచా' గీతం విడుదలైంది. పెళ్లి వేడుకల్లో మార్మోగేలా ఈ పాట ఆకట్టుకుంటుంది. ఈ పాటకు కమల్ హాసన్ సాహిత్యాన్ని అందించడం విశేషం. బాలీవుడ్ బ్యూటీ సన్యా మల్హోత్రా ఈ పాటలో సందడి చేస్తుంది.
ఈ చిత్రాన్ని తమిళనాడులో రెడ్ జెయింట్ మూవీస్, తెలుగులో శ్రేష్ట్ మూవీస్, నార్త్‌లో పెన్ మరుధర్, కర్ణాటకలో ఫైవ్ స్టార్ సెంథిల్ సంస్థలు భారీ స్థాయిలో విడుదల చేయబోతున్నాయి. మే 23న సిడ్నీలో జరగనున్న 'థగ్ లైఫ్' మ్యూజికల్ ఫెస్టివల్‌లో ఏఆర్ రెహమాన్ లైవ్ ప్రదర్శన ఇవ్వనుండటం మరింత హైప్‌ను పెంచుతోంది. మొత్తంగా 'నాయకుడు' వంటి క్లాసిక్ తర్వాత 'థగ్ లైఫ్'తో వస్తోన్న కమల్, మణిరత్నం ఎలాంటి సంచలనాలు సృష్టిస్తారో చూడాలి.
-
Home
-
Menu