బుర్రకథ శిఖామణి 'గరివిడి లక్ష్మి'

బుర్రకథ శిఖామణి గరివిడి లక్ష్మి
X
అచ్చమైన తెలుగమ్మాయి, యువ కథానాయిక ఆనంది ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం ‘గరివిడి లక్ష్మి’. ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.

అచ్చమైన తెలుగమ్మాయి, యువ కథానాయిక ఆనంది ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం ‘గరివిడి లక్ష్మి’. ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. 1990ల కాలంలో ఉత్తరాంధ్ర బుర్రకథ కళాకారిణిగా ఎంతో గుర్తింపు పొందిన గరివిడి లక్ష్మి జీవితాన్ని ఆధారంగా చేసుకుని ఈ చిత్రం తెరకెక్కుతోంది.

15 సంవత్సరాల్లో 10 వేలకు పైగా ప్రదర్శనలిచ్చారు గరివిడి లక్ష్మి. బుర్రకథ ద్వారా జానపద కళలకు జీవం పోసిన ఘనత ఆమెది. తాజాగా విడుదలైన ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్, గ్లింప్స్ ఆకట్టుకుంటున్నాయి. 'హలో మైక్ టెస్టింగ్..' అంటూ మొదలైన గ్లింప్స్‌ ద్వారా లక్ష్మి పాత్రలో ఆనంది పరకాయ ప్రవేశం చేసినట్టే భావన కలిగిస్తోంది.

నరేష్, రాగ్ మయూర్, శరణ్య, రాశి, ప్రదీప్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. గౌరీ నాయుడు జమ్మూ అనే కొత్త దర్శకుడు ఈ చిత్రంతో పరిచయమవుతున్నాడు. ఈ సినిమాకు చరణ్ అర్జున్ సంగీతం అందిస్తుండగా, జె. ఆదిత్య సినిమాటోగ్రఫీ సమకూరుస్తున్నాడు.



Tags

Next Story