‘విశ్వంభర‘ పాటలు ఎంతో ప్రత్యేకం.. వశిష్ఠ!

‘విశ్వంభర‘ పాటలు ఎంతో ప్రత్యేకం.. వశిష్ఠ!
X
మెగాస్టార్ చిరంజీవి హీరోగా వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతున్న సోషియో ఫాంటసీ మూవీ ‘విశ్వంభర’. యు.వి.క్రియేషన్స్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి.

మెగాస్టార్ చిరంజీవి హీరోగా వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతున్న సోషియో ఫాంటసీ మూవీ ‘విశ్వంభర’. యు.వి.క్రియేషన్స్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. విజువల్ ఎఫెక్ట్స్ కి ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ రూపొందుతున్న ఈ మూవీలో పాటలూ ఎంతో వైవిధ్యంగా ఉంటాయట. ఆస్కార్ విజేత కీరవాణి ఈ సినిమాకి సంగీతాన్ని సమకూరుస్తున్నాడు.


దాదాపు మూడు దశాబ్దాల తర్వాత చిరు-కీరవాణి కాంబోలో రాబోతున్న సినిమా ఇదే. ఈ మూవీలోని పాటలు ఎంతో ప్రత్యేకంగా ఉండబోతున్నట్టు తెలుపుతూ తాజాగా చిరంజీవి, కీరవాణి, చంద్రబోస్ లతో ఓ ప్రత్యేకమైన ఫోటోను షేర్ చేశాడు డైరెక్టర్ వశిష్ట. మరోవైపు త్వరలోనే ‘విశ్వంభర‘ నుంచి ఫస్ట్ సింగిల్ రాబోతున్నట్టు తెలుస్తోంది.


ఈ సినిమాలో చిరంజీవికి జోడీగా త్రిష నటిస్తుండగా.. ఇతర కీలక పాత్రల్లో ఆషిక రంగనాథ్, సురభి, ఇషా చావ్లా, కునాల్ కపూర్ వంటి వారు కనిపించబోతున్నారు. మే 9న ‘విశ్వంభర‘ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తుందట టీమ్.


Tags

Next Story