'పరదా' నుంచి 'యత్ర నార్యస్తు' పాట

పరదా నుంచి యత్ర నార్యస్తు పాట
X
అందాల భామ అనుపమ పరమేశ్వరన్ లీడ్ రోల్‌లో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పరదా’. ఈ సినిమాలో సంగీత, దర్శన రాజేంద్రన్ ఇతర కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.

అందాల భామ అనుపమ పరమేశ్వరన్ లీడ్ రోల్‌లో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పరదా’. ఈ సినిమాలో సంగీత, దర్శన రాజేంద్రన్ ఇతర కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ‘సినిమా బండి’తో తనదైన ముద్ర వేసిన దర్శకుడు ప్రవీణ్ కండ్రేగుల ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.

ఇప్పటికే రిలీజైన టీజర్, 'మా అందాల సిరి' పాటలతో మంచి క్రేజ్ సంపాదించుకున్న 'పరదా' నుంచి 'యత్ర నార్యస్తు' అంటూ సాగే గీతం విడుదలైంది. గోపీ సుందర్ మ్యూజిక్ లో వనమాలి రాసిన ఈ పాటను అనురాగ్ కులకర్ణి ఎంతో ఎమోషనల్ గా ఆలపించాడు. సినిమాలోని ఓ కీలక సన్నివేశంలో వచ్చే పాటగా ఇది ఉండబోతున్నట్టు తెలుస్తోంది. ఈ మూవీలో అనుపమ పరదా వేసుకునే సంప్రదాయం గల అమ్మాయిగా కనిపించబోతుంది. ఆగస్టు 22న ఈ చిత్రం ఆడియన్స్ ముందుకు రాబోతుంది.



Tags

Next Story