'పరదా' నుంచి ‘మా అందాల సిరి’!

పరదా నుంచి ‘మా అందాల సిరి’!
X
అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం 'పరదా'. ఈ సినిమాలో సంగీత, దర్శన రాజేంద్రన్ ఇతర కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.

అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం 'పరదా'. ఈ సినిమాలో సంగీత, దర్శన రాజేంద్రన్ ఇతర కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ‘సినిమా బండి’తో తనదైన ముద్ర వేసుకున్న దర్శకుడు ప్రవీణ్ కండ్రేగుల తన రెండవ చిత్రంగా ‘పరదా’ను తీసుకొస్తున్నాడు.

ఆనంద మీడియా బ్యానర్‌పై తెరకెక్కుతోన్న ఈ మూవీ నుంచి లేటెస్ట్ గా 'మా అందాల సిరి' అనే పాట విడుదలైంది. గోపీ సుందర్ స్వరపరిచిన ఈ పాటకు వనమాలి అందించిన సాహిత్యం బాగుంది. శ్రీ కృష్ణ, రమ్య బెహరా ఈ పాటను ఆలపించారు. పరదా వేసుకునే ఓ పల్లెటూరి అమ్మాయిగా ఈ పాటలో అనుపమ అలరిస్తుంది. ఇక ‘టిల్లు స్క్వేర్’తో పూర్తి స్థాయి గ్లామరస్ లుక్ లో అదరగొట్టిన అనుపమ ఇప్పుడు 'పరదా' కోసం సంప్రదాయంగా కనువిందు చేయబోతుంది. త్వరలో ఈ చిత్రం ఆడియన్స్ ముందుకు రానుంది.



Tags

Next Story