రిలీజ్ ట్రైలర్ తో సీన్ మారిపోయింది!

నితిన్ నటించిన ‘తమ్ముడు’ జూలై 4న విడుదలకు సిద్ధమవుతోంది. ‘వకీల్ సాబ్’ ఫేమ్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించి లేటెస్ట్ గా రిలీజ్ ట్రైలర్ వచ్చింది. ఈ ట్రైలర్ సినిమా పై అంచనాలు పెంచుతోంది.
ట్రైలర్‌లో అక్క-తమ్ముడు మధ్య అనుబంధం ప్రధానాంశంగా కనిపిస్తోంది. ‘మా అమ్మ చనిపోయింది.. అమ్మ అయినా నాన్న అయినా అన్నీ అక్కే‘ అనే డైలాగ్‌తో ట్రైలర్ ప్రారంభమవుతుంది. తన అక్క చేత ‘తమ్ముడు’ అని పిలిపించుకోవాలన్న ఆరాటంతో నితిన్ పాత్ర సాగుతుంది. ఎమోషన్‌తో పాటు యాక్షన్ సన్నివేశాలు కూడా ట్రైలర్‌ను హైలైట్ చేశారు.
ఈ చిత్రంలో నితిన్‌కు జోడీగా సప్తమి గౌడ, వర్ష బొల్లమ్మ నటించారు. సీనియర్ నటి లయ గ్యాప్ తర్వాత రీఎంట్రీ ఇస్తూ కీలక పాత్రలో కనిపించబోతుంది. సౌరభ్ సచ్ దేవా, స్వాసిక, హరితేజ, చమ్మక్ చంద్ర ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. అజనీష్ లోక్ నాథ్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్ ట్రైలర్‌ను మరింత ఎలివేట్ చేశాయి.
ఈ సినిమాపై దిల్ రాజు, వేణు శ్రీరామ్ ఎంతో నమ్మకంగా ఉన్నారు. ముందే ప్రీమియర్లు వేయాలన్న నిర్ణయం ఆ నమ్మకాన్నే సూచిస్తోంది. వరుస ఫ్లాపుల తర్వాత నితిన్‌కు ఇది కీలక సినిమాగా మారనుంది. పవన్ కళ్యాణ్ టైటిల్‌ను ఎమోషనల్ కథతో మిళితం చేసిన ‘తమ్ముడు’ చిత్రం బాక్సాఫీస్‌పై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో చూడాలి.
-
Home
-
Menu